సాహో ప్రభాస్: బర్త్ డే గిఫ్ట్ అదిరింది

ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, టోటల్ టాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సాహో. 

Last Updated : Oct 23, 2018, 02:29 PM IST
సాహో ప్రభాస్: బర్త్ డే గిఫ్ట్ అదిరింది

ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, టోటల్ టాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సాహో. ఈ మూవీకి సంబంధించి మొట్టమొదటి విజువల్స్‌ను విడుదల చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. షేడ్స్ ఆఫ్ సాహో పేరిట  విడుదల చేసిన చాప్టర్-1 విజువల్స్ హాలీవుడ్ మూవీని తలపించాయి. సినిమాలో ఎంతో కీలకమైన అబుదాబి షెడ్యూల్స్‌కు సంబంధించిన విజువల్స్ ఇవి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో దాదాపు 60 రోజుల పాటు కష్టపడి కంపోజ్ చేసిన యాక్షన్ విజువల్స్‌‌‌ను మేకింగ్ వీడియోగా విడుదల చేశారు.

ఈ ఒక్క షెడ్యూల్ కే దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు నిర్మాతలు.ఇక మేకింగ్ చివర్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. ఈ పుట్టినరోజు నాడు  యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి ఇంతకుమించిన రీజన్ అక్కర్లేదు. సుజీత్ రెడ్డి దర్శకత్వంలో వి.వంశీ క్రిష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, భూషణ్ కుమార్ నిర్మాతలుగా రూపొందుతున్న "సాహో" చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు శంకర్ ఎహసాన్ లాయ్ మ్యూజిక్ అందిస్తుండగా... రూ.300 కోట్ల బడ్జెట్‌తో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, ఎవలెన్ శర్మ,  అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్, ముంబయితో పాటు అబుదబి, దుబాయ్, రొమానియా, యూరోప్ దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని మార్చి 21, 2019 తేదిన విడుదల చేయబోతున్నారు నిర్మాతలు.

Trending News