కేన్స్ వేడుకలో ఐశ్వర్య సోయగాలు

కేన్స్‌ 71వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కన్నుల పండుగగా సాగిపోతోంది.

Updated: May 14, 2018, 01:05 PM IST
కేన్స్ వేడుకలో ఐశ్వర్య సోయగాలు

కేన్స్‌ 71వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కన్నుల పండుగగా సాగిపోతోంది. ఫ్రాన్స్‌లోని రివేరా నదీ తీరంలో జరుగుతున్న ఈ వేడుకకి ప్రపంచ నలుమూల నుంచి సినీ ప్రముఖులు రావడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. అందాల తారల హోయలొలికిస్తూ రెడ్‌కార్పెట్‌పై నడిచారు. ఈ ఉత్సవంలో హాలీవుడ్‌ తారలతో పాటు భారతీయ తారలు పాల్గొన్నారు. ఈ ఏడాది పలువురు భారతీయ తారలు ఉత్సవానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమదైన అందం, వస్త్రధారణ, అలంకరణలతో చూపరులను ఆకట్టుకున్నారు.

ఎప్పటిలానే ఐశ్వర్యారాయ్‌ ఈ ఏడాది వేడుకలో ఆకర్షణీయంగా నిలిచారు. ఆమె కేన్స్‌లో మెరవడం ఇది 17వ సారి. కుమార్తె ఆరాధ్యతో కలిసి కేన్స్‌కు చేరుకున్న ఐశ్వర్య ఎర్రతివాచీపై చేసిన సందడితో చూపరులు ముగ్దులైపోయారు. ఈ కేన్స్ ఫెస్టివల్లో రెడ్‌కార్పెట్‌పై ఐష్ రెండు సార్లు నడిచారు. మొదటి రోజు ప్రముఖ డిజైనర్‌ మిఖాయెల్‌ సింకో రూపొందించిన సీతాకోకచిలుక డ్రస్సులో ఆకట్టుకున్నారు. రెండవ రోజు ముందు సాగరకన్య స్టయిల్‌లో మెరిసి కొద్దిసేపట్లోనే కౌచర్ స్టయిల్‌లో వైట్ కలర్ గౌన్‌లో కొత్త లుక్‌తో కనిపించారు. దీంతో ఫ్యాషన్ ప్రియుల కళ్లన్నీ ఆమెపైనే ఫోకస్ అయ్యాయి. అలాగే దీపికాపదుకొనె ఎర్రటి గులాబి రంగు వస్త్రధారణ చిత్రోత్సవానికి వచ్చారు. కంగనారనౌత్‌, మల్లికా షెరావత్‌, హ్యూమా ఖురేషి తదితరులు కూడా తమదైన అందం, వస్త్రధారణలతో అలరించారు.

 

 

 

Circle of Life 💖😍✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

 

 

 

‪5th part of #aishwaryaraibachchan at red carpet ✨✨✨‬

A post shared by All about bollywoodLoveAishSRK (@olivialove_aishwarya_srk) on

 

 

 

SUNSHINE n RAINBOWS...😍😘🌈✨💖

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

 

 

LOVE LOVE LOVE 💖.... n RESPECT✨✨✨@helenmirren

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

 

 

 

Queen walking at Cannes with her Princess #AaradhyaBachchan #Aishwaryarai ❤👌

A post shared by Aishwarya Rai Bachchan News (@aishwaryaraibacchan) on

 

 

✨✨✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on