నోబెల్ ప్రైజ్‌కి నామినేటైన తెలుగు కవి ఎవరు?

నోబెల్ ప్రైజ్.. ఇప్పటి వరకు రవీంద్రనాథ్ టాగూర్, అమర్త్యాసేన్, కైలాష్ సత్యర్థి లాంటి భారతీయులకు మాత్రమే లభించిన అద్భుతమైన పురస్కారం. అలాంటి పురస్కారానికి ఓసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రచయిత కూడా నామినేట్ అయ్యారట.

Last Updated : Apr 2, 2018, 12:06 AM IST
 నోబెల్ ప్రైజ్‌కి నామినేటైన తెలుగు కవి ఎవరు?

నోబెల్ ప్రైజ్.. ఇప్పటి వరకు రవీంద్రనాథ్ టాగూర్, అమర్త్యాసేన్, కైలాష్ సత్యర్థి లాంటి భారతీయులకు మాత్రమే లభించిన అద్భుతమైన పురస్కారం. అలాంటి పురస్కారానికి ఓసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రచయిత కూడా నామినేట్ అయ్యారట. అవును ఇది నిజం..! 2004 సంవత్సరంలో తెలుగు రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన "నా దేశం నా ప్రజలు" పుస్తకం నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.

అయితే ఆ రచనకు అవార్డు రాలేదు. చిత్రమేంటంటే.. రవీంద్రనాథ్ టాగూర్ తర్వాత భారతదేశం తరఫున నోబెల్ పురస్కారానికి నామినేట్ అయిన రెండవ భారతీయ రచయిత శేషేంద్ర మాత్రమే. 1994లో శేషేంద్ర రచన "కాలరేఖ" 'సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్ పురస్కారంతో సత్కరించింది.

అక్టోబరు 20, 1927లో నెల్లూరు జిల్లా నాగార్జునపాడులో జన్మించిన శేషేంద్ర శర్మ మండే సూర్యుడు, రక్తరేఖ, నీరై పారిపోయింది, నరుడు - నక్షత్రాలు, స్వర్ణ హంస, ఆధునిక మహాభారతం, జనవంశం, కవిసేన మేనిఫెస్టో, మబ్బుల్లో దర్బార్, ఋతు ఘోష, ప్రేమ లేఖలు, శేషజ్యోత్స్న లాంటి రచనలెన్నో చేశారు. 1993లో సాహిత్యంలో శేషేంద్ర చేసిన సేవలకు గాను సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం లభించింది. అలాగే 1994లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కూడా అందించింది. 

Trending News