క్రీడాకారులకు అనువైన ఆహారం.. చామదుంప

ఏనుగు చెవుల దుంప అని చామదుంపను చాలామంది సరదాగా అంటుంటారు. ఎందుకంటే చామదుంప ఆకులు అచ్చం ఏనుగు చెవుల్లాగే చాలా పెద్దవిగా ఉంటాయి.

Updated: Jun 7, 2018, 02:01 PM IST
క్రీడాకారులకు అనువైన ఆహారం.. చామదుంప

ఏనుగు చెవుల దుంప అని చామదుంపను చాలామంది సరదాగా అంటుంటారు. ఎందుకంటే చామదుంప ఆకులు అచ్చం ఏనుగు చెవుల్లాగే చాలా పెద్దవిగా ఉంటాయి. ఆగ్నేయ ఆసియాలో పుట్టి ఆ తర్వాత భారతదేశంతో పాటు  ఇండోనేసియా, ఫిలిప్పిన్స్ దీవులలో కూడా పాగా వేసిన చామదుంపలో మంచి పోషకాలు ఉంటాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. అలాగే తక్కువ కేలరీలతో ఎక్కువ శక్తినిచ్చే ఆహారం చామదుంప. క్రీడాకారులకు అనువైన ఆహారం కూడా. మరి చామదుంప ఉపయోగాలేమిటో మనం కూడా తెలుసుకుందామా..!

*దాదాపు 100 గ్రాముల చామదుంపలు 120 కేలరీల బలాన్ని అందిస్తాయి.

*చామదుంపలల్లో  పోషక నార ఎక్కువగా ఉంటుంది. అందుకే జీర్ణ ప్రక్రియను తేలిక చేస్తూ.. రక్తప్రవాహంలోకి గ్లూకోజ్‌ని నిదానంగా విడుదల చేస్తుంది. 

*విటమిన్‌ సి, బి6, మేంగనీస్, కేల్సియం, ఇనుము చామదుంపల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

*అజీర్తి, హైపర్‌ టెన్షన్, కండరాల బలహీనతకు చామదుంప మంచి ఔషధంగా పనిచేస్తుంది.

*క్రీడాకారులకు అనువైన ఆహారం చామదుంప. తక్కువ క్యాలరీలు గల ఆహారం కావడం వల్ల వేగంగా జీర్ణమయ్యి తక్కువ సమయంలో ఎక్కువ శక్తినిస్తుంది.

*చామదుంప తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం కావడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ కూరగాయను తమ డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

*ఐరన్, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజ లవణాలు కూడా చామ దుంపల్లో ఉంటాయి.

*మహిళల ఎండోక్రైన్‌ వ్యవస్థ సక్రమ పనితీరుకు చామదుంప ఎంతగానో దోహదపడుతుంది.

*రక్తపోటు క్రమబద్దీకరణకు సహకరించే పొటాషియం కూడా చామదుంపలో బాగానే లభిస్తుంది.

*మిగతా దుంపల మాదిరిగానే చామదుంపల్లో కూడా ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.