దెయ్యాలు ఇంట్లో ఉన్నాయో.. లేవో తెలుసుకోవడం ఎలా.. ?

దెయ్యం అనేది ఓ గొప్ప అభూతకల్పన. ఈ ప్రపంచంలో కొందరు దెయ్యాలున్నాయని వాదిస్తుంటే.. మరికొందరు దెయ్యాలు లేవని వాదిస్తుంటారు. 

Last Updated : Nov 2, 2018, 06:20 PM IST
దెయ్యాలు ఇంట్లో ఉన్నాయో.. లేవో తెలుసుకోవడం ఎలా.. ?

దెయ్యం అనేది ఓ గొప్ప అభూతకల్పన. ఈ ప్రపంచంలో కొందరు దెయ్యాలున్నాయని వాదిస్తుంటే.. మరికొందరు దెయ్యాలు లేవని వాదిస్తుంటారు. దెయ్యం అనేది ఓ మూఢ నమ్మకమని అనే వారు కూడా ఉంటారు. దేవుడినే నమ్మని నాస్తికులైతే.. తాము దెయ్యాలను కూడా నమ్మే ప్రసక్తి లేదంటారు. ఆధ్యాత్మిక వేత్తలైతే దేవుడిని నమ్మేవారు దెయ్యాలను కూడా నమ్మాలని చెబుతుంటారు. ఏదైతేనేం.. దెయ్యమనే టాపిక్ ఓ పెద్ద చర్చనే అప్పుడప్పుడు లేవదీస్తుంది.

దెయ్యాలు ఇంట్లో అడుగుపెడితే కొన్ని నిదర్శనాలు కనిపిస్తుంటాయి అని చెప్పడం సినిమాల్లో కూడా రివాజుగా మారింది. ఈ క్రమంలో మనం కూడా ఈ దెయ్యాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. దెయ్యాల మీద పరిశోధనలు చేసిన కొందరు వ్యక్తులు దెయ్యాలు ఇంట్లో సంచరిస్తున్నాయో లేదో కనిపెట్టడం ఎలా? అనే విషయం మీద వివిధ సందర్భాల్లో మాట్లాడారు. వాటిల్లో కొన్ని మీకోసం..!

*ఉన్నట్టుండి మీరున్న చోట ఉష్ణోగ్రత తగ్గుముఖం పడితే అక్కడ అతీతశక్తులు ఉన్నట్లు అని అర్థం.

*అదేవిధంగా సాధారణంగా రాత్రివేళ్లలో అరిచే జంతువుల అరుపుల్లో బాధతో కూడిన శబ్దాలు వినిపిస్తే.. అక్కడే కూడా ఏదో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థమట.

*ఇల్లు ఎంత శుభ్రం చేసినా కూడా.. ఏదైనా భరించలేనంత దుర్గంధపూరితమైన వాసనను పదే పదే మీ ఇంట్లో మీరు గమనిస్తే.. అక్కడ కూడా ఏదో తెలియని నెగటివ్ ఎనర్జీ ఉండే అవకాశముందని అంటుంటారు.

*ఇరుకైన గోడల మధ్య మనుషులు కదులుతున్న భావన కలగడం.. అలాగే నిశ్శబ్దమైన గదుల్లో మీకు మాత్రమే ఏదో రోదన వినిపించడం అనేది కూడా అతీత శక్తులు ఉన్నాయనడానికి సంకేతమని అంటుంటారు.

*మీరు మాత్రమే ఒంటరిగా ఉన్న ఇంట్లో.. మీకు నిచ్చెన ఎక్కుతున్న శబ్దం గానీ, మెట్లు ఎక్కుతున్న శబ్దం గానీ.. గాలి పీలుస్తున్న శబ్దం కానీ మీకు వినిపిస్తే.. అక్కడ కూడ దెయ్యాలు ఉన్నాయని చెప్పవచ్చు అంటారు కొందరు పారానార్మల్ యాక్టివిస్టులు.

*మీ ఇంట్లో బల్బులు వాటంతట అవి వెలిగినా.. ఫ్యాన్లు వాటంతట తిరిగినా కూడా అక్కడే ఏదో తెలియని శక్తి ఉండే అవకాశం ఉందని చెబుతుంటారు.

*మీ కనుచూపు మేరలో ఎవరూ లేకపోయినా.. ఎవరో మీ పేరు పిలిచినట్లు అనిపిస్తే.. అక్కడ కూడా దెయ్యం ఉందని భావించవచ్చని పలువురు అంటుంటారు. 

*మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు.. ఏదో మిమ్మల్ని తాకినట్లు అనిపిస్తే.. అక్కడ కూడా ఏ దెయ్యమో.. భూతమో ఉన్నట్లు భావించవచ్చు అని అంటారు. 

*మీ చుట్టు ప్రక్కల ఇళ్ళలో పసిపిల్లలు లేకపోయినా.. రాత్రిపూట పసిబిడ్డలు ఏడుస్తున్నట్లు వినిపిస్తే.. ఏదో దెయ్యం మీ ఇంటి వద్ద సంచరిస్తున్నట్లు భావించవచ్చని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. 

(గమనిక: ఈ వ్యాసంలో పొందుపరిచిన అంశాలు.. ఈ సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలను నుండి తీసుకోవడం మాత్రమే జరిగింది. అంతే కానీ.. మూఢనమ్మకాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రాసిన వ్యాసం ఎంతమాత్రం కాదు. ఇందులో విషయాలకు వెబ్ సైటు ఎలాంటి బాధ్యతా వహించదు).

Trending News