మహేష్ బాబు మహర్షి మూవీ విడుదలకు ముహూర్తం ఫిక్స్!

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు లేటెస్ట్ మూవీ మహర్షిపై అభిమానుల్లో భారీ​ అంచనాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది.

Last Updated : Jan 23, 2019, 11:24 AM IST
మహేష్ బాబు మహర్షి మూవీ విడుదలకు ముహూర్తం ఫిక్స్!

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు లేటెస్ట్ మూవీ మహర్షిపై అభిమానుల్లో భారీ​ అంచనాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్‌ రాజు తాజాగా మహర్షి విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్‌ 25న మహర్షి మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దిల్ రాజు తెలిపారు. మహేష్‌ బాబు నటించిన చిత్రాల్లో ఇది 25వ సినిమా కనుక.. ఏప్రిల్‌ 25న విడుదల చేసేందుకు ముహుర్తం ఫిక్స్‌ చేసినట్టు సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. 

మహేష్ బాబు సరసన పూజా హెగ్డె జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్‌ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. దిల్ రాజుతోపాటు అశ్వనీదత్, ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ మూవీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. జూన్‌లో మహేష్ బాబు-సుకుమార్ కాంబోలో సినిమా సెట్స్‌కి వెళ్లనున్నట్టు సమాచారం. 

Trending News