మణికర్ణిక ట్రైలర్ వచ్చేసింది

మణికర్ణిక ట్రైలర్

Last Updated : Dec 18, 2018, 02:17 PM IST
మణికర్ణిక ట్రైలర్ వచ్చేసింది

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక సినిమా ట్రైలర్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుంది. సినిమాపై కంగనా రనౌట్ అధికారం చెలాయిస్తుందనే ఆరోపణలూ వినిపించాయి. అనేక నాటకీయ పరిణామాల మధ్య క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేసినట్టు ప్రచారం జరిగిన అనంతరం నటి కంగనా రనౌతే అన్నీ తానై ఈ ప్రాజెక్టును తన చెప్పుచేతల్లో పూర్తిచేసినట్టు వార్తలొచ్చాయి. ఎంతో విలువైన కథాంశంతో రూపొందిన ఈ ప్రాజెక్టు షూటింగ్ దశలోనే ఎన్నో వివాదాలతో తీవ్ర అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఇన్ని వివాదాల మధ్య ఇవాళ విడుదల మధ్య మేకర్స్ ఇవాళ ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. 

Trending News