అనుపమ్ ఖేర్ ట్విట్టర్ హ్యాక్

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్ హ్యాక్ అయ్యింది.

Updated: Feb 8, 2018, 10:50 AM IST
అనుపమ్ ఖేర్ ట్విట్టర్ హ్యాక్

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్ హ్యాక్ అయ్యింది. స్నేహితులు ఫోన్ చేసి చెప్తేగానీ హ్యాక్ అయిందన్న విషయం ఖేర్‌కు కూడా తెలియలేదు.

ఖాతాను హ్యాక్ చేసినవారు టర్కీకి చెందిన వారిగా, తమను టర్కిష్ సైబర్ అర్మీగా ప్రకటించుకున్నారు. ఈ సైబర్ ముఠా ఖేర్ ఖాతాను హ్యాక్ చేసి మెసేజ్‌లు కూడా పెట్టింది. 'మీ ఖాతాను టర్కిష్ సైబర్ ఆర్మీ టీం హ్యాక్ చేసింది. మీకు సంబంధించిన కీలక డేటాను స్వాధీనం చేసుకున్నాం. ఐ లవ్ పాకిస్తాన్' అంటూ ట్వీట్ పెట్టేసింది. దీనిపై ఖేర్ స్పందించారు.

'నా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. భారత్‌లో ఉండే నా స్నేహితుల నుండి ఇప్పుడే కాల్స్ వచ్చాయి. నేను ప్రస్తుతం లాస్‌ఏంజల్స్‌లో ఉన్నాను. ఇక్కడ సమయం అర్థరాత్రి దాటింది (1am). నేను ట్విట్టర్ యాజమాన్యంతో మాట్లాడాను' అని ఖేర్ ఏఎన్ఐకి చెప్పారు.

తొలుత అనుపమ్ ఖేర్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేసిన ట్విట్టర్ యాజమాన్యం.. ఆ తరువాత మళ్లీ రిలీజ్ చేసింది.