సైరా నరసింహారెడ్డిలో నయనతార ఫస్ట్ లుక్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం "సైరా నరసింహారెడ్డి". సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరుకి జోడిగా నయనతార నటిస్తున్నారు.

Last Updated : Nov 18, 2018, 12:12 PM IST
సైరా నరసింహారెడ్డిలో నయనతార ఫస్ట్ లుక్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం "సైరా నరసింహారెడ్డి". సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరుకి జోడిగా నయనతార నటిస్తున్నారు. నరసింహారెడ్డి సతీమణి సిద్ధమ్మ పాత్రను ఆమె పోషిస్తున్నారు. ఈ రోజు ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. ఈ రోజు నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మహారాణి గెటప్‌లో ఈ ఫస్ట్ లుక్‌లో కథానాయిక కనిపించడం విశేషం.  తెలుగుతో పాటు,  హిందీ, తమిళ్‌ తదితర భాషల్లో  "సైరా నరసింహారెడ్డి" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.  

అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై  రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌  మొదలైనవారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొన్నాళ్లు జార్జియాలో కూడా జరిగింది. 

రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి.1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్ట పాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

 

Trending News