ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీలో ఎవరెవరు, ఏయే పాత్రలు పోషించారో తెలిపే వీడియో

ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీలో పాత్రలను పరిచయం చేస్తూ వీడియో విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ ఎన్.బి.కే ఫిలింస్

Last Updated : Jan 17, 2019, 12:56 PM IST
ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీలో ఎవరెవరు, ఏయే పాత్రలు పోషించారో తెలిపే వీడియో

ఎన్.టి.ఆర్ కథా నాయకుడు, ఎన్.టి.ఆర్ మహానాయకుడు టైటిల్స్ పేరిట రెండు భాగాలుగా తెరకెక్కిన ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీలో చాలా మంది సినీ ప్రముఖులు ఎన్టీఆర్ జీవితంలోని పలువురు ముఖ్యమైన వ్యక్తుల పాత్రలను పోషించారు. ఆయా సినీ ప్రముఖులలో ఎవరెవరు, ఎవరి పాత్రలను పోషించారనే వివరాలను వెల్లడిస్తూ తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఎన్.బి.కే ఫిలింస్ ఓ వీడియో విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మొదటి భాగం కథా నాయకుడు సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుండగా ప్రస్తుతం మహానాయకుడు సినిమాలోని పలు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు అదే సమయంలో మహానాయకుడు ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా పూర్తిచేసుకుంటున్నాయి. జాగర్లమూడి క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషించగా ఆయన సతీమణి బసవతారకం పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించిన సంగతి తెలిసిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీలో పాత్రల పరిచయం చేస్తూ ఎన్.బి.కే ఫిలింస్ విడుదల చేసిన వీడియో

 

Trending News