తాతగారి చివరి కారులో తొలిరోజు షూటింగ్‌కు..

తాతగారి చివరి కారులో తొలిరోజు షూటింగ్‌కు..

Last Updated : Sep 12, 2018, 04:13 PM IST
తాతగారి చివరి కారులో తొలిరోజు షూటింగ్‌కు..

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. అయితే ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. బుధవారం నుంచి ఆయన షూటింగ్ ప్రారంభం కానుంది.

షూటింగ్‌లో భాగంగా..సెట్స్ కు వెళ్లేందుకు సుమంత్‌ కారులో బయల్దేరారు. విశేషమేమిటంటే.. ఆ కారు అక్కినేని నాగేశ్వర రావు వాడిన ఆఖరి కారు. ఈ విషయాన్ని సుమంత్‌ ట్విటర్‌ ద్వారా చెప్తూ.. కారులో ప్రయాణిస్తున్నప్పుడు తీసిన ఫొటోను పంచుకున్నారు. ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఏఎన్నార్‌ పాత్రలో నటించడానికి ఆయన వాడిన చివరి కారులో నా ఫస్ట్ డే షూటింగ్‌కు వెళ్తున్నా.’ అని ట్వీట్‌ చేశారు.

కాగా ఇటీవలే ఎన్టీఆర్‌ అల్లుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న రానా దగ్గుబాటి లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ ఫొటోలు చూస్తుంటే.. రానా అచ్చం చంద్రబాబులాగే కన్పించారని అభిమానులు, నెటిజన్లు చెప్పారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ రెడీ చేస్తున్న చిత్ర యూనిట్.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనుంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Driving in #ANR's last car for my first day of shoot, to play #ANR in the #NTRBiopic #NTR

A post shared by Sumanth (@sumanth_kumar) on

 

Trending News