ముస్లింని పెళ్లిచేసుకుందని కరీనాపై కామెంట్లు

కథువా అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముస్లిం అయిన ఎనిమిదేళ్ల ఆసిఫాపై కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. కొందరు సినీ తారలు బాధితులకు అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. ఆ దిశగా కూడా ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో క‌రీనా, స్వరా ప్లకార్డులు పట్టుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. అందులో ‘నేను హిందుస్థానీని. నాకు సిగ్గుగా ఉంది. మా ఆసిఫాకు న్యాయం జరగాలి. ఎనిమిదేళ్ల ఆ చిన్నారిని అమ్మవారి ఆలయ సమీపంలోనే అత్యాచారం చేశారు’ అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ బాలీవుడ్ న‌టి కరీనాక‌పూర్‌ను ఉద్దేశిస్తూ, 'ఒక హిందూ అయివుండి ముస్లింను(సైఫ్ అలీ ఖాన్) పెళ్లి చేసుకున్నందుకు కరీనా సిగ్గు పడాలి. పైగా వారికి పుట్టిన కుమారుడికి తైమూర్‌ అని ఓ రాక్షసుడి పేరు పెట్టారు' అని ట్వీట్‌ చేశాడు. దీనిపై బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ దీటుగా సమాధానమిచ్చారు. 'అసలు నీలాంటి వాడు ఈ భూమ్మీద ఉన్నందుకు సిగ్గుగా ఉంది. దేవుడు నీకు బుర్ర ఇస్తే అందులో ద్వేషాన్ని మాత్రమే నింపుకొన్నావు. భారతదేశానికే నువ్వు సిగ్గుచేటు. నీలాంటి వారు పబ్లిసిటీ కోసమే ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు' అని ట్వీట్ చేసింది.

 

 

 

English Title: 
Swara Bhasker slams Twitter user for trolling Kareena Kapoor Khan
News Source: 
Home Title: 

ముస్లింని పెళ్లిచేసుకుందని కరీనాపై కామెంట్లు

ముస్లింని పెళ్లిచేసుకుందని కరీనాపై కామెంట్లు
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ముస్లింని పెళ్లిచేసుకుందని కరీనాపై కామెంట్లు