ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు ద‌ర్శక నిర్మాత‌లు. 

Last Updated : Oct 19, 2018, 08:55 PM IST
 ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు ద‌ర్శక నిర్మాత‌లు. ఇందులో త‌మ‌న్నా ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయి పాత్రలో న‌టిస్తుంది. ప్రతిష్టాత్మక ఐఫిల్ ట‌వ‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంది. అమాయ‌కంగా ఉండే ఓ అమ్మాయి..  జీవితంలో ఎదురైన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఎలా శ‌క్తిమంత‌మైన మ‌హిళగా మారుతుంది అనేది ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి క‌థ‌. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. మైఖెల్ ట‌బూరియ‌స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తైజాన్ ఖొరాకివాలా ఈ చిత్రాన్ని  స‌మ‌ర్పిస్తుండ‌గా.. మీడియెంట్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌లో మ‌ను కుమ‌రన్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్తవ్వగా... ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల్లో బిజీగా ఉంది ఈ చిత్రం. త్వరలోనే ఈ  చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. హిందీలో విడుదలైన క్వీన్ చిత్రానికి ఈ చిత్రం రీమేక్. ఈ చిత్రంలో తమన్నాతో పాటు సంజయ్ స్వరూప్, జగపతిబాబు, ప్రియదర్శి పులికొండ మొదలైన వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

హిందీలో కంగన రనౌత్ పోషించిన పాత్రను తెలుగులో ఈ చిత్రంలో తమన్నా పోషిస్తున్నారు. తొలుత దర్శకుడు నీలకంఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సైన్ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో.. ప్రశాంత వర్మ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. అయితే నీలకంఠ ఇదే సినిమాని మలయాళంలో మంజిమా మోహన్ కథానాయికగా "జామ్ జామ్" పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇదే సినిమా తమిళ రీమేక్‌లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రం పేరు "పారిస్ పారిస్". ఇదే సినిమా కన్నడ వెర్షన్‌‌కి కూడా రమేష్ అరవిందే దర్శకత్వం వహిస్తుండగా.. కథానాయికగా పారుల్ యాదవ్ నటిస్తున్నారు. ఈ చిత్రం పేరు "బటర్ ఫ్లై".

Trending News