వారెవ్వా అనిపించే అంతరిక్షం మూవీ థీమ్ వీడియో

అంతరిక్షం మూవీ థీమ్ వీడియో

Last Updated : Dec 14, 2018, 07:47 PM IST
వారెవ్వా అనిపించే అంతరిక్షం మూవీ థీమ్ వీడియో

వరుణ్ తేజ్ అప్‌కమింగ్ సినిమా అంతరిక్షం సినిమా టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ఆ సినిమాపై అంచనాలు రెట్టింపు చేయగా తాజాగా మేకర్స్ విడుదల చేసిన థీమ్ వీడియో మరింత ఆకట్టుకుంటోంది. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాల కోసం ఆర్ఆర్ కంపోజిషన్‌కు యూనిట్ కష్టపడిన విధానాన్ని ఈ థీమ్ వీడియోలో చూపించారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ కంపోజ్ చేయగా బి ప్రసన్న ఆర్కెస్ట్రా బాధ్యతలు చూసుకున్నారు. ఈ థీమ్ వీడియోలోని ఆర్ఆర్‌ను నిశితంగా పరిశీలిస్తే, శరత్ జే నేతృత్వంలోని ప్రద్వయ్ శివ్ శంకర్ చేసిన మిక్సింగ్ వారెవ్వా అనిపించకమానదు. ప్రముఖ దర్శకుడు క్రిష్ సమర్పిస్తున్న ఈ సినిమా ఈ నెల 21న ఆడియెన్స్ ముందుకు రానుంది.

Trending News