హనీమూన్‌ కోసం వచ్చి.. హోటల్ యజమానులయ్యారు..!

శ్రీలంకలో హనీమూన్ గడపడానికి వచ్చిన ఓ బ్రిటీష్ జంట.. తాగిన మైకంలో ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. 

Updated: Oct 17, 2018, 05:44 PM IST
హనీమూన్‌ కోసం వచ్చి.. హోటల్ యజమానులయ్యారు..!

శ్రీలంకలో హనీమూన్ గడపడానికి వచ్చిన ఓ బ్రిటీష్ జంట.. తాగిన మైకంలో ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఇంగ్లాండ్ దేశానికి చెందిన మార్క్ లీ దంపతులు శ్రీలంకలో ఓ బీచ్ రిసార్ట్‌లో గడపడానికి వచ్చారు. బాగా రాత్రి అయ్యాక.. బయట రమ్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న వారికి లోపలి నుండి కొన్ని మాటలు వినిపించాయి. ఆ రోజుతో ఆ హోటల్ నిర్వహణ కోసం చేసుకున్న లీజు అగ్రిమెంట్ ముగుస్తుందని.. మరుసటి రోజు నుండి హోటల్ క్లో్జ్ అవుతుందని యజమానులు మాట్లాడుకోవడం వీరి చెవిన పడింది. అంతే.. ఆ జంటకు ఓ సరికొత్త ఆలోచన వచ్చింది.

తమ హనీమూన్‌కు కేరాఫ్ అడ్రసుగా మారిన ఆ బీచ్ రిసార్టును తామే లీజుకు తీసుకుంటే ఎలాగుంటుందని అనుకున్నారు. బాగా తాగి ఉన్నా కూడా.. వెంటనే హోటల్ లోపలికి వెళ్లి ఇదే విషయాన్ని చెప్పారు. కావాలంటే.. అడ్వాన్స్ కూడా తీసుకోండని కొంత సొమ్ము వారి చేతిలో పెట్టారు. ఈ జంట వింత ప్రవర్తనకు యజమానులు ఆశ్చర్యపోయినా.. మంచి బేరం దొరికినందుకు సంతోషించారు. అంతే.. రేటును అమాంతం పెంచేశారు. మూడు సంవత్సరాల లీజుకు 30,000 పౌండ్లు అని డిమాండ్ చేశారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా ముఫ్ఫై లక్షల రూపాయలు అన్నమాట.

అయినా ఆ జంట అదరలేదు.. బెదరలేదు. డబ్బులిచ్చి అగ్రిమెంట్ చేసేసుకున్నారు. మరుసటి రోజు హోటల్ పేరు కూడా మార్చేశారు. తమకు లక్ తీసుకొచ్చి పెట్టిన ఆ హోటల్‌కి లక్కీ బీచ్ టాంగ్లే అని పేరు పెట్టారు. ఏదో సరదాగా హానిమూన్ ఎంజాయ్ చేయాలని వచ్చిన తాము.. ఓ హోటల్‌కి యజమానులమవుతామని అసలు ఊహించలేదని అంటున్నారు ఆ జంట. ఏదేమైనా.. బహు చిత్రంగా ఉంది కదా.. ఈ బ్రిటీష్ జంట కథ. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close