వీడియో: బాద్‌షా-రసెల్‌.. 'చమ్మక్‌ చల్లో’ డాన్స్

ఐపీఎల్‌లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్లతో హోరెత్తించాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రసెల్‌.

Updated: Apr 13, 2018, 10:02 AM IST
వీడియో: బాద్‌షా-రసెల్‌.. 'చమ్మక్‌ చల్లో’ డాన్స్

ఐపీఎల్‌లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్లతో హోరెత్తించాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రసెల్‌. తాజాగా రసెల్‌ బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ కలిసి  ‘రావన్‌‌’ సినిమాలోని ‘చమ్మక్‌ చల్లో’ పాటకు డాన్స్ వేశారు.

ఈడెన్‌గార్డెన్స్‌, చెపాక్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడిన మ్యాచ్‌లకు ఆ జట్టు సహ యజమాని షారుక్‌ఖాన్‌ హాజరై ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తున్నాడు. మ్యాచ్‌కి ముందు, తర్వాత కూడా ఆటగాళ్లతో కలిసి గడుపుతున్నాడు. ఈ సందర్భంగా కోల్‌కతా ఆటగాడు రసెల్‌, సునీల్‌ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, కమలేశ్‌ నాగర్‌ కోటితో కలిసి షారుక్‌ ఖాన్‌ డాన్స్ చేశాడు. ఈ వీడియోను రసెల్‌ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఫన్‌ టైం విత్‌ ద బాస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

 

Fun time with the boss himself! #SRK

A post shared by Andre Russell (@ar12russell) on

 

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ 36 బంతుల్లో 88 పరుగులు సాధించి కోల్‌కతాకు భారీ స్కోరు అందించాడు. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు గెలిచింది. అయినప్పటికీ రసెల్ ఆటతీరును అందరూ మెచ్చుకున్నారు. టోర్నీలో భాగంగా కోల్‌కతా తన తదుపరి మ్యాచ్‌ను  హైదరాబాద్‌ జట్టుతో ఆడనుంది.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close