రామఫలం... మనో ఉత్తేజానికి మహాబలం

Updated: Feb 22, 2018, 03:33 PM IST
రామఫలం... మనో ఉత్తేజానికి మహాబలం

మీరు సీతాఫలం పేరు వినే ఉంటారు.. కానీ రామఫలం పేరు ఎప్పుడైనా విన్నారా.. అన్నోనా రెటిక్యూలేట్ అనే బొటానికల్ నేమ్‌తో చాలా పాపులరైన ఈ ఫలం వల్ల ఉపయోగాలు అనేకం. కరీబియన్ ప్రాంతాలైన వెస్ట్ ఇండీస్‌తో పాటు సౌత్ అమెరికా లాంటి చోట్ల ఈ ఫలం మూలాలు ఉన్నాయని.. దీనిని బులక్స్ హార్ట్ అంటారని కూడా వినికిడి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలుచోట్ల ఈ ఫలాలు విరివిగా  దొరుకుతున్నాయి. అలాగే అస్సాం, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలకు చెందిన గిరిజన ప్రాంతాల్లో ఇవి బాగా దొరుకుతుంటాయి. ఆయుర్వేద వైద్యులు కూడా ఈ ఫలంలో వైద్యగుణాలు ఉన్నాయని, మానసిక ఉత్తేజాన్ని పెంచుకోవడం కోసం దీనిని భుజించవచ్చని చెబుతుంటారు. ఈ క్రమంలో ఈ ఫలం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..

  • గుండ్రంగా కనిపిస్తూ, గుండె ఆకారంలో ఉండే ఈ ఫలం ఎరుపురంగులో ఉంటుంది. అయితే ఇందులో ఎక్కువ గింజలు ఉంటాయి. అలసిన శరీరానికి ఉత్తేజాన్ని కలిగించడానికి ఈ బులక్స్ హార్ట్‌ని పశ్చిమదేశాల్లో క్రీడాకారులు జ్యూస్‌గా చేసి తాగుతుంటారట.
  • అలాగే ఈ ఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. మలేరియా లాంటి వ్యాధులు రాకుండా నివారించే గుణం ఈ ఫలానికి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు
  • అలాగే మిగతా ఫలాలతో పోల్చుకుంటే ఈ ఫలంలో విటమన్ల శాతం ఎక్కువ. సీ విటమన్‌, పైరిడాక్సిన్ ఎక్కువగా ఈ ఫలంలో ఉంటాయి. ఈ పైరిడాక్సిన్ అనేది మెదడుకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా  ఉంచుతుంది. 
  • అలాగే నరాల బలహీనత, విపరీతంగా తలనొప్పితో బాధపడేవారు రామఫల రసాన్ని సేవించవచ్చు
  • అలాగే రామఫలం ఆకులను యాంటీ అల్సర్ ట్రీట్‌మెంట్‌కి వాడుతుంటారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close