ఈ పండ్లతో ఇన్ఫెక్షన్ కు చెక్

Updated: Jan 20, 2018, 01:21 PM IST
ఈ పండ్లతో ఇన్ఫెక్షన్ కు చెక్

పండ్లు తింటే మేలు. కానీ కొందరు పండ్లు అవగాహన లేకుండా ఊరికే తింటుంటారు. అయితే.. ఏ పండు ఎందుకు తింటున్నాం, దాని వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో తెలుసుకోరు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా పండ్లు ఉపయోగపడతాయనే విషయం తెలుసా మీకు?. ఇదేకాదు.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైన అలర్జీ, తుమ్ములు, గ్యాస్ వంటివాటిని కూడా పండ్లు నివారిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని పండ్లు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..! 

* నేరేడు: వీటిలో క్యాలరీలు తక్కువ స్థాయిలో.. ఐరన్, పొటాషియం, విటమిన్స్ అధిక స్థాయిలో వుంటాయి. ఇవి సాధారణంగా సంభవించే చిన్నచిన్న జబ్బులను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. 

* బేరిపండ్లు: సీజనల్‌గా వచ్చే చిన్న చిన్న వ్యాధులకు ఇందులో ఉండే విటమిన్లు చక్కటి పరిష్కారం.  

* లీచీ: ఇందులో విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, రోగం తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి కావల్సిన యాంటీఆక్సిడెంట్స్‌ను సరఫరా చేసి అధిక బరువును తగ్గిస్తుంది.

* పీచ్ : ఈ పండ్లలో పీచు పదార్ధం అధికం, క్యాలరీలు తక్కువ. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. అధికంగా వుండే విటమిన్ 'సి' వ్యాధి నిరోధకతను పెంచుతుంది.

* ప్లమ్స్: శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. ఫ్లూ, కోల్డ్ వంటి ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచుతుంది. 

* అరటి: అరటిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

* చెర్రీస్ : వీటిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఒత్తిడికి గురైన మెదడుకు ప్రశాంతతను, విశ్రాంతిని అందిస్తుంది.  

* బొప్పాయి : ఇందులో విటమిన్ 'సి' అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే అధిక పీచు పదార్ధం అనేక జబ్బులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. 

* దానిమ్మ : ఇది కూడా శరీరంలో వ్యాధినిరోధకతను వృద్ధి చేస్తుంది. ఈ దానిమ్మ విత్తనాల్లో అనేక న్యూట్రీషియన్స్ ఉంటాయి.

* ఆపిల్స్ : ఆపిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..! రోజుకో ఆపిల్ తింటే డాక్టర్లు కూడా అక్కర్లేదు అంటుంటారు. ఈ పండ్లు వివిధ రకాల జబ్బుల  నివారణలో సహాయపడ్తాయి .