ఏ రోగానికి ఏ మెడిసిన్ వాడాలో చెప్పే యాప్

ఈ ప్రపంచంలో చాలా రోగాలు ఉన్నాయి. అన్ని రోగాలకు, రుగ్మతలకు ట్రీట్‌మెంట్ కోసం అందరూ డాక్టర్ వద్దకు వెళ్తారు.

Updated: Mar 8, 2018, 08:08 PM IST
ఏ రోగానికి ఏ మెడిసిన్ వాడాలో చెప్పే యాప్

ఈ ప్రపంచంలో చాలా రోగాలు ఉన్నాయి. అన్ని రోగాలకు, రుగ్మతలకు ట్రీట్‌మెంట్ కోసం అందరూ డాక్టర్ వద్దకు వెళ్తారు. అయినా సరే.. తాము వాడే మందులపై రోగులకు కూడా కనీస అవగాహన అవసరం. అందుకోసం ఆటోమిక్ ఇన్ఫో యాప్స్ వారు మెడికల్ డిక్షనరీ పేరుతో ఓ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌లో ఏ అనారోగ్యానికి ఏ మెడిసిన్ వేసుకోవాలో, ఏ మాత్రలు, సిరప్స్ వాడాలో, ఏ ఇంజెక్షన్లు తీసుకోవాలో పూర్తి వివరాలతో సహా పొందుపరిచారు. అలాగే ఆయా మెడిసిన్స్ వాడడం వల్ల ఉపయోగాలు, అనర్థాలను కూడా  పొందుపరిచారు.

అయితే ఈ యాప్‌ను కేవలం నాలెడ్జ్ పెంచుకోవడానికే వాడాలి తప్పితే.. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మాత్రం డాక్టర్ వద్దకు కచ్చితంగా వెళ్లాలని అంటున్నారు యాప్ నిర్వాహకులు. అంతేగానీ, గుడ్డిగా యాప్‌లో చెప్పిన మెడిసిన్స్‌ను కొనుగోలు చేసి వాడడం అంత క్షేమకరం కాదని.. సాధ్యమైనంత మేరకు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లకు అనుగుణంగానే మందులు, మాత్రలు వాడాలని వారు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లేస్టోరులో అందుబాటులో ఉంది.