ఇనుప ముక్కలు తింటూ జీవిస్తున్న మహిళ.. ఆశ్చర్యపోయిన వైద్యులు..!

అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు ఇనుప ముక్కలు తినే అలవాటు ఉందని తెలిసి ఆశ్చర్యపోయారు అక్కడి వైద్యులు.

Last Updated : Nov 13, 2018, 04:40 PM IST
ఇనుప ముక్కలు తింటూ జీవిస్తున్న మహిళ.. ఆశ్చర్యపోయిన వైద్యులు..!

అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు ఇనుప ముక్కలు తినే అలవాటు ఉందని తెలిసి ఆశ్చర్యపోయారు అక్కడి వైద్యులు. ఓ రోజు ఆమె విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ అరుస్తున్న సమయంలో ఆమెకు చికిత్స చేయడానికి వచ్చిన ఎండోక్రైనాలజిస్ట్ తనకు స్కానింగ్ తీయించారు. ఆ సమయంలో ఆమె కడుపులో ఇనుప ముక్కలు ఉన్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. వెంటనే శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులోని  వస్తువులు అన్నింటిని బయటకు తీశారు.

ఆ వస్తువుల్లో పిన్నులు, రోల్డ్ గోల్డ్ చెవిదుద్దులు, హెయిర్ పిన్నులు, చిన్న చిన్న చైనులు ఉండడం చూసి కంగుతిన్నారు. ఈ చిత్రమైన ప్రవర్తన కలిగిన రోగి.. ఆక్యుఫాజియాయిన్ అనే రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ రుగ్మతతో బాధపడేవారు తమ ఎదుట ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువును నోట్లో వేసుకుంటారని.. ఇదో మానసిక వ్యాధి అని సీనియర్ సర్జన్ డాక్టర్ నితిన్ పార్మర్ తెలిపారు. ఒకప్పుడు సదరు రోగి వీధులలో తిరుగుతూ చెత్త ఏరుకునేదని పలువురు చెబుతున్నారు.

ఆమె మానసిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే తనను స్థానికులు మానసిక వైద్యశాలలో చేర్చారని అంటున్నారు. అయితే ఆ రోగానికి చికిత్స ఉందో లేదో డాక్టర్లు తెలియజేయలేదు. ప్రస్తుతం రోగిని పరిశీలనలో పెట్టామని.. ఆమె వైద్యపరీక్షలకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్టు వచ్చాక.. ట్రీట్ మెంట్ గురించి ఆలోచిస్తామని వైద్యులు అంటున్నారు. 

Trending News