పోటీ పరీక్షలు: 2వేల పోస్టులకు 10 లక్షల మంది దరఖాస్తు

అర్హత సాధిస్తున్న వారిలో దాదాపు 70% మంది ఇంజినీరింగ్ ప‌ట్టభ‌ద్రులు, ఎంబీఏ పూర్తిచేసిన వారే ఉంటున్నారు.

Updated: May 18, 2018, 09:49 AM IST
పోటీ పరీక్షలు: 2వేల పోస్టులకు 10 లక్షల మంది దరఖాస్తు

ఇటీవల ఎస్బీఐ 2 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. ఈ పీవో పోస్టులతో పాటు 8,300 క్లరికల్ పోస్టులకు నోటికేషన్ విడుదల చేయగా.. ఇప్పటి వరకూ 16.6 లక్షల దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు.

ఎస్బీఐ డిప్యూటీ ఎండీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, పీవో పోస్టుల‌కు ఏదేనీ డిగ్రీ అర్హత కావ‌డం వ‌ల్ల బీటెక్, ఎంసీఏ, ఎంబీఏతో పాటు డిగ్రీ చేసిన వారు అధిక సంఖ్యలో పోటీ ప‌డుతున్నట్లు చెప్పారు. పీవో పోస్టులకు దరఖాస్తు ఆయా అభ్యర్థులు రాత‌ప‌రీక్ష పాసై, ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్కష‌న్‌లో విజ‌యం సాధించ‌వ‌ల‌సి ఉంటుంద‌ని చెప్పారు. ఎస్బీఐ క్లర్కు ఉద్యోగాల‌కు అర్హత సాధిస్తున్న వారిలో దాదాపు 70% మంది ఇంజినీరింగ్ ప‌ట్టభ‌ద్రులు, ఎంబీఏ పూర్తిచేసిన వారే ఉంటున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.