ఐటీ దాడులు: రూ.160 కోట్లు, వంద కేజీల బంగారం స్వాధీనం

తమిళనాడులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహదారుల నిర్మాణ పనులను కాంట్రాక్టుకు తీసుకునే కంపెనీపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.

Last Updated : Jul 17, 2018, 10:08 AM IST
ఐటీ దాడులు: రూ.160 కోట్లు, వంద కేజీల బంగారం స్వాధీనం

తమిళనాడులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహదారుల నిర్మాణ పనులను కాంట్రాక్టుకు తీసుకునే కంపెనీపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఐటీ అధికారులు తనిఖీ చేయగా రూ.160 కోట్ల నగదు, 100 కిలోల బంగారం లభించింది. లెక్కలో రాని ఈ నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పన్ను ఎగవేత విషయమై అనుమానాలు తలెత్తడంతో ఏక కాలంలో సంస్థపై దాడులు నిర్వహించామని ఐటీ అధికారులు తెలిపారు.

ఎస్పీకే అండ్ కంపెనీపై దాడి చేసిన ఐటీ అధికారులకు.. పార్క్ చేసిన కార్లలో నగదు పెద్ద బ్యాగుల్లో డబ్బు లభించింది. దాడిలో లభించిన డబ్బును, బంగారాన్ని పరిశీలించేందుకు మరో రోజు సోదాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కింద ఎన్నో ప్రాజెక్టులు దక్కించుకున్న ఈ కంపెనీకి ఒక బాస్ ఉన్నాడని, అతనికి రాజకీయ పలుకుబడి ఉండటంతో ఎన్నో ప్రాజెక్టులు దక్కాయని విచారణలో తేలిందని, అతనిపై కేసు నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న రహదారుల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తన బంధువులకు కట్టబెడుతున్నారని  డైరెక్టరేట్ ఆఫ్  విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) కి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే జూన్‌లో ఫిర్యాదు చేసింది.

Trending News