షాకింగ్ న్యూస్: 75 శాతం మందికి మోదీ ఎవరో తెలియదట !

                        

Updated: Jun 9, 2018, 04:29 PM IST
షాకింగ్ న్యూస్: 75 శాతం మందికి మోదీ ఎవరో తెలియదట !

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు నేత. ప్రపంపంలోనే అత్యంత శక్తివంతమైన నేతల జాబితాలో మోడీ ఎప్పూడు ముందు వరుసలో ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి ఆ దేశంలో 75 శాతం మందికి తెలియదట. సరే అదిఏమైనా చిన్నాచితక దేశమా అంటే ..అదీ కాదు. అభివృద్ధిలో ఎప్పూడు ముందు వరసలో ఉండే దేశం..అక్షరాస్యతలో ముందుండే దేశం. సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న దేశం. అసలు విషయం తెలుసుకోవాంటే వివరాల్లోకి వెళ్లాల్సిండి.

ప్రపంపంలోనే అత్యంత శక్తివంతమైన నేతల జాబితాలో భారత ప్రధాని మోడీ ఎప్పూడు ముందు వరుసలో ఉంటారు. అలాంటి నేత గురించి కెనడాలో 75 శాతం మంది ప్రజలకు తెలియదట. వినడానికి ఆశక్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది నిజం. కెనడాకు చెందిన  యాంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ సర్వేలో ఇది తేలింది. జీ 7 దేశాల సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆశ్చర్యకరమైన విషయం ఇలా బయటికి వచ్చింది.  ప్రతిష్ఠాత్మకమైన టైమ్ మేగజీన్ నిర్వహించిన 2016 ఆన్ లైన్ రీడర్స్ పోల్ లో టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైనా భారత్ ప్రధాని మోడీ గురించి తెలియకపోవడం ఆశర్యం కాకపోతే మరేమౌతుంది.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close