మోదీపై సెటైర్ వేసిన మహిళా ఎమ్మెల్యే

'త్రిపుల్ తలాక్' అంశం భారతదేశంలో ఈ ఏడాది వార్తల్లో నిలిచింది. సున్నితమైన ఈ అంశాన్ని భారత ప్రభుత్వం తట్టి లేపిందనే చెప్పుకోవచ్చు.

Updated: Dec 30, 2017, 04:09 PM IST
మోదీపై సెటైర్ వేసిన మహిళా ఎమ్మెల్యే

ఢిల్లీ: 'త్రిపుల్ తలాక్' అంశం భారతదేశంలో ఈ ఏడాది వార్తల్లో నిలిచింది. సున్నితమైన ఈ అంశాన్ని భారత ప్రభుత్వం తట్టి లేపిందనే చెప్పుకోవచ్చు. ఇది ముస్లిం మహిళలకు ఏ మాత్రం రక్షణ కల్పించే విధంగాలేదంటూ.. కేంద్రం దీనిపై ఒక చట్టాన్ని రూపిందించింది. ఆ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. దీనిపై అనేకమంది అనేక రకాలుగా స్పందించారు. అయితే.. స్పందించే తీరులో కాస్త దూకుడుగా వ్యవహరించారు ఒక మహిళా ఎమ్మెల్యే.

ఆ మహిళా ఆప్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఆమె పేరు అల్కా లంబ. త్రిపుల్ తలాక్ ను ఉద్దేశిస్తూ.. మోదీపై ట్వీట్ చేశారు. "ఎందుకు అనవసరంగా త్రిపుల్ తలాక్ చెప్పి జైలుకెళ్తారు. ఆమెకు ఏమీ చెప్పకుండా వదిలేస్తే భారత దేశానికి ప్రధాని కావొచ్చు" అని మోదీ వైవాహిక జీవితాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై కొందరు నెటిజన్లు మద్దతు ఇస్తున్నా..మరికొందరు విమర్శిస్తున్నారు. "కాంగ్రెస్ పార్టీని వీడి ఆప్ పార్టీలో చేరిన ఆమెకు మోదీ గొప్పతనం గురించి ఏం తెలుసు?" అని బీజేపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.