విజయ్ మాల్యాకు అసలు అపాయింట్‌మెంటే ఇవ్వలేదు : అరుణ్ జైట్లీ

విజయ్ మాల్యాకు అసలు అపాయింట్‌మెంటే ఇవ్వలేదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ

Updated: Sep 13, 2018, 12:43 PM IST
విజయ్ మాల్యాకు అసలు అపాయింట్‌మెంటే ఇవ్వలేదు : అరుణ్ జైట్లీ

తాను దేశం విడిచిపెట్టి రావడానికన్నా ముందే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించానని, జెనివాలో ఓ అత్యవసర సమావేశం ఉండటం వల్లే భారత్ నుంచి వచ్చానని ఇవాళ విజయ్ మాల్యా చేసిన ఓ ప్రకటనపై అరుణ్ జైట్లీ ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. 2014 నుంచి తాను అసలు విజయ్ మాల్యాకు అపాయింట్‌మెంటే ఇవ్వలేదని, ఇక మాల్యా తనను కలిశాడనే ఆరోపణల్లో నిజం ఎక్కడ ఉంటుందని అరుణ్ జైట్లీ తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.