మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ హెల్త్ బులెటిన్ విడుదల

ఏబీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ హెల్త్ బులెటిన్

Last Updated : Jun 13, 2018, 09:00 PM IST
మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ హెల్త్ బులెటిన్ విడుదల

గడిచిన 48 గంటల్లో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్యం చాలా మెరుగుపడిందని ఎయిమ్స్ ప్రకటించింది. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిలో చాలా మార్పులుచేర్పులు చోటుచేసుకున్నాయని, ఆయన కిడ్నీలు కూడా బాగా పనిచేస్తున్నాయని ఎయిమ్స్ తమ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఎయిమ్స్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వాజ్‌పేయి గుండె, శ్వాసక్రియ, రక్తపోటు వంటివన్ని సరిగ్గా పనిచేస్తున్నట్టు ఎయిమ్స్ వర్గాలు మీడియాకు తెలిపాయి. రానున్న కొద్ది రోజుల్లోనే వాజ్‌పేయి పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అవుతారని ఎయిమ్స్ ఆస్పత్రివర్గాలు ఆశాభావం వ్యక్తంచేశాయి. 

అటల్ బిహారి వాజ్‌పేయి తనకు యధావిధిగా జరిగే వైద్య పరీక్షల కోసం సోమవారం ఆస్పత్రిలో చేరారు. అయితే, వైద్య పరీక్షల సమయంలో ఆయన మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు తేలడంతో వైద్యులు ఆయనకు ఆ దిశగా చికిత్స అందించడం మొదలుపెట్టారు. ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో వాజ్‌పేయికి చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా మాజీ ప్రధాని వాజ్‌పేయికి వ్యక్తిగత వైద్యుడిగానూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

Trending News