ఆర్కిటెక్చర్‌లో "నోబెల్" స్థాయి బహుమతి.. తొలిసారిగా భారతీయుని కైవసం

ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ స్థాయి బహుమతిగా పేరొందిన ప్రిట్జ్‌కర్ ప్రైజ్ తొలిసారిగా ఓ భారతీయుడిని వరించింది. 

Updated: Mar 9, 2018, 12:41 PM IST
ఆర్కిటెక్చర్‌లో "నోబెల్" స్థాయి బహుమతి.. తొలిసారిగా భారతీయుని కైవసం
Image Credit: Twitter

ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ స్థాయి బహుమతిగా పేరొందిన ప్రిట్జ్‌కర్ ప్రైజ్ తొలిసారిగా ఓ భారతీయుడిని వరించింది. తొలిసారిగా ఈ పురస్కారాన్ని భారతీయ ఆర్కిటెక్ట్ బాలక్రిష్ణ దోషి అందుకోనున్నారు. భారతదేశంలో పేదలకు ఇళ్లు కట్టివ్వడంలో ఉన్నత స్థాయి ప్రమాణాలు పాటించినందుకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఆయనకు ఇటీవలే 90 ఏళ్ళు నిండడం విశేషం.

ఆర్టిటెక్చర్ రంగంలో విశేష అనుభవం ఉన్న బి.దోషి తక్కువ ఖర్చుతో మెరుగైన హౌసింగ్ పద్ధతులు కనిపెట్టడంలో నిష్ణాతులు. దాదాపు 70 ఏళ్ళు ఈ రంగంలో ఉన్న ఆయన ఇండోర్‌లో అరణ్య లో కాస్ట్ హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా 80,000 మందికి మెరుగైన వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో ముఖ్యపాత్ర పోషించారు. అహ్మదాబాద్‌లోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్మాణాలకు కూడా దోషియే దగ్గరుండి సూపర్ వైజ్ చేశారు.

ప్రస్తుతం కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్న దోషి, ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు. తన పద్ధతులు సాధారణ రియల్ ఎస్టేట్ డెవలపర్ల ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకమని.. అధిక డబ్బు వెచ్చించి మంచి వసతులు సమకూర్చడం గొప్ప విషయం కాదని.. ఉన్న బడ్జెట్‌లోనే పేదలకు మెరుగైన, అనువైన ఇండ్లు కట్టడంలో సామాజిక బాధ్యత కూడా ఉందని అన్నారు. బి.దోషికి ప్రిట్జ్‌కర్ ప్రైజ్ రావడం పట్ల పలువురు భారతీయ ఆర్కిటెక్టులు స్పందించారు. ఆయనను భారతదేశ ఆర్కిటెక్చర్ రంగానికి గాడ్ ఫాదర్‌గా పేర్కొన్నారు. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close