కాంగ్రెస్‌కి ఓటేసిన ఓటర్లకు కృతజ్ఞతలు : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఓటర్లకు కృతజ్ఞతలు : రాహుల్ గాంధీ

Updated: May 15, 2018, 09:39 PM IST
కాంగ్రెస్‌కి ఓటేసిన ఓటర్లకు కృతజ్ఞతలు : రాహుల్ గాంధీ

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఓటర్లకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఓటర్లను అభినందించిన రాహుల్ గాంధీ.. ఓటర్ల అభ్యున్నతి కోసం పోరాడటానికి సిద్ధంగా వున్నట్టు స్పష్టంచేశారు. 

 

అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో అంకిత భావంతో, అలుపనేది లేకుండా కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు సైతం రాహుల్ గాంధీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు.