బూట్లు, సాక్సులు వేసుకొని టెన్త్ పరీక్షలకు రాకూడదట..!

బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు ఓ సరికొత్త విధానానికి నాంది పలికింది.

Last Updated : Feb 20, 2018, 12:31 PM IST
బూట్లు, సాక్సులు వేసుకొని టెన్త్ పరీక్షలకు రాకూడదట..!

బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు ఓ సరికొత్త విధానానికి నాంది పలికింది. పబ్లిక్ పరీక్షల్లో జరిగే కాపీయింగ్‌ని అరికట్టడానికి, విద్యార్థులు స్లిప్స్ తీసుకురావడాన్ని నిరోధించడానికి ఓ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. అందుకే విద్యార్థులందరూ చెప్పులు వేసుకొని మాత్రమే పరీక్షలకు హాజరుకావాలని ఆదేశించింది. బూట్లు, సాక్సులు వేసుకొని వస్తే మాత్రం లోపలికి అనుమతించేది లేదని బోర్డు ప్రకటించింది.

ఇటీవలే జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో దాదాపు 985 మంది విద్యార్థులు స్లిప్స్ సాక్సుల్లో పెట్టుకొని వచ్చి.. చీటింగ్ చేస్తూ దొరికిపోయిన విషయాన్ని ఉదహరిస్తూ ఈ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టామని బోర్డు తెలిపింది. ఇకపై ఈ విధానాన్ని బిహార్‌లో బోర్డు పరిధిలోకి వచ్చే ఇతర పోటీ పరీక్షలకు కూడా వర్తింపజేయాలని చూస్తున్నామని బిహార్ స్కూలు ఎగ్జామినేషన్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం 17.70 లక్షల మంది విద్యార్థులు బిహార్‌లో నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు.

Trending News