Delhi Pollution: ఢిల్లీలో చేయుదాటుతున్న పరిస్థితులు.. లాక్‌డౌన్‌ వైపుగా కేజ్రీవాల్..ఎమర్జెన్సీగా ప్రకటించిన సుప్రీం

కాలుష్యం కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌  (Delhi-NCR) ప్రజల పరిస్థితి అతలాకుతలమవుతోంది. ఆకాశం పూర్తిగా పొగమంచు కప్పబడి ఉన్నందువలన ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) కొన్ని చర్యలు తీసుకున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 07:42 PM IST
  • ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం
  • ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితిలో ఢిల్లీ
  • ఈ పరిస్థితులలో కీలక ప్రకటనలు చేసిన ఢిల్లీ సీఎం
  • లాక్‌డౌన్‌ కూడా పెట్టే యోచనలు ఢిల్లీ ప్రభుత్వం
Delhi Pollution: ఢిల్లీలో చేయుదాటుతున్న పరిస్థితులు.. లాక్‌డౌన్‌ వైపుగా కేజ్రీవాల్..ఎమర్జెన్సీగా ప్రకటించిన సుప్రీం

Schools in Delhi Shutting Down due to Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై సీరియస్‌గా ఉన్న ఢిల్లీ ప్రభుత్వం (Delhi government) కొన్ని కీలక చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రం జరిగిన సమావేశం అనంతరం సీఎం కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) పలు కీలక ప్రకటనలు చేశారు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో కాలుష్యం బాగా పెరిగిపోయిందని కేజ్రీవాల్ అన్నారు.

ఇంతకుముందు ఢిల్లీలో వాతావరణం శుభ్రంగా ఉండేది కానీ దీపావళి (Deepavali) తర్వాత కాలుష్యం క్రమంగా పెరుగుతూ వచ్చిందని తెలిపారు.  ప్రస్తుత పరిస్థితులు ఎవరివల్ల కలిగాయో మాట్లాడుకోవటం కన్నా ఇలాంటి ఎమర్జెన్సీ సమయంలో విపత్కర పరిస్థుతలను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించటమే మా ధ్యేయమని సీఎం అన్నారు.

Also Read: Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్

ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ భారీ ప్రకటన చేశారు

1) సోమవారం నుండి ఢిల్లీలో పాఠశాలలు మూసివేయబడతాయి...  కానీ ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయి.

2) నవంబర్ 14 నుండి 17 వరకు అన్ని నిర్మాణ స్థలాలు మూసివేయబడతాయి.

3) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని రోజులు వరకు మూసివేయబడతాయి..  కానీ పని మాత్రం కొనసాగుతుంది. ఉద్యోగులందరూ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాసించారు. 

4) దీనితో పాటు, ఇంటి నుండి పని చేసే అన్ని ప్రైవేట్ కార్యాలయాలకు సంబంధించి ఒక సలహా కూడా జారీ చేయబడ్డాయి. 

5) సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, 'ఢిల్లీలో పూర్తి లాక్‌డౌన్‌కు (Delhi Lockdown) సంబంధించి ప్రతిపాదన సిద్ధమవుతోంది. లాక్‌డౌన్‌ ఒక పెద్ద ముందడుగు, అది ఒక్క క్షణంలో జరగదని పేర్కొన్నారు. 

Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!

సుప్రీంకోర్టు ఆగ్రహం 

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వాయు కాలుష్యం పెరగడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) శనివారం కూడా 'ఎమర్జెన్సీ'గా (Emergency) పేర్కొంది.  ఢిల్లీ మరియు చుట్టూ ఉన్న ప్రాంతాలలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని మరియు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ పరిస్థితిని 'ఎమర్జెన్సీ' ప్రకటించిన సుప్రీం కోర్టు

ఈ పరిస్థితికి గల కారణంగా రైతులను బాధ్యులుగా చిత్రీకరించాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కానీ గత వారం రోజులుగా ఢిల్లీలో ఎన్ని టపాసులు కాల్చారో ఎవరైన పట్టించుకున్నారా..?? దీనిని  అత్యవసర 'ఎమర్జెన్సీ' (Emergency Situation) పరిస్థితిగా పరిగణించాలి. ఈ పరిస్థితిని పరిష్కరించటానికి గ్రౌండ్ లెవెల్లో అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. 

Also Read: Shocking News about Sudhir:జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్ అండ్ టీమ్..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News