సెకన్ల వ్యవధిలో ఢీకొనే ప్రమాదం నుంచి బయటపడ్డ విమానాలు

Updated: Jul 13, 2018, 05:25 PM IST
సెకన్ల వ్యవధిలో ఢీకొనే ప్రమాదం నుంచి బయటపడ్డ విమానాలు

తృటిలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్న 6E 779, బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న 6E 6505  ఇండిగోకు చెందిన రెండు వినానాలు ఎదురుపడ్డాయి. బెంగళూరు వద్ద ఆకాశంలో చాలా సమీపంగా వచ్చాయి. వాటి మధ్య ఎత్తులో తేడా కేవలం 200 అడుగులు మాత్రమే ఉంది. ట్రాఫిక్‌ కొలిషన్‌ సిస్టమ్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేయడంతో రెండు విమానాల్లోని పైలట్లు వెంటనే స్పందించి ప్రమాదం జరగకుండా నివారించారు. జూలై 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   

హైదరాబాద్‌కు చెందిన విమానంలో 162 మంది ప్రయాణికులు ఉండగా, మరో విమానంలో 166 మంది ప్రయాణికులు ఉన్నారు. గగనతలంలో ఒకదానికిమరోకటి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ప్రస్తుతం ఈ ఘటనపై విమానశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది