నటి ప్రియా వారియర్ పై హైదరాబాద్‌లో కేసు నమోదు

కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ పై హైదరాబాదులో కేసు నమోదైంది.

Updated: Feb 15, 2018, 12:49 PM IST
నటి ప్రియా వారియర్ పై హైదరాబాద్‌లో కేసు నమోదు

కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ పై హైదరాబాదులో కేసు నమోదైంది. ముస్లిం మనోభావాలు దెబ్బతినేలా ఓ పాటలో ఆమె నటించారంటూ కొంత మంది ముస్లిం యువకులు ఆమెపై ఫలక్‌నూమా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కేవలం 26 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియోతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఏళ్లపాటు శ్రమించినా రాని గుర్తింపును.. ఓ చిన్న వీడియోతో సొంతం చేసుకుంది ఈ యువతి.

తన అద్భుతమైన హావభావాలతో, చూపులతో కుర్రకారు మతిపోగొట్టింది. 'ఒరు అదార్ లవ్' మూవీ ప్రోమోను విడుదల చేయగా... అందులో ప్రియ ముఖ కవళికలు యూత్‌ను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో, రాత్రికి రాత్రే ఆమె పెద్ద స్టార్ అయిపోయింది. ఆమె చూపులకు ఫిదా అయిపోయిన సెలబ్రిటీలు అంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: అమ్మాయి కళ్లకు 50లక్షల మంది 'ఫిదా'