భయ్యూజీ మహారాజ్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ డిమాండ్

                                                    

Updated: Jun 13, 2018, 05:27 PM IST
భయ్యూజీ మహారాజ్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ డిమాండ్

మధ్యప్రదేశ్ కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ  మహారాజ్ మరణంపై మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మహారాజ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యుల పట్ల ప్రగాఢ సానుభూమి తెలిపారు. ఈ సందర్భం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ మహారాజ్ స్వార్ధం లేని వ్యక్తి అని.. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థ సేవ చేస్తారని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటు.. దేశం ఓ విలువైన వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు  భయ్యూజీ మరణానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వమే కారణమని  కాంగ్రెస్ ఎంపీ మానక్ అగర్వాల్ సంచలన ఆరోపణ  చేశారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ భయ్యూజీపై  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ విషయంలో ఆయన అనేక రాకాల ప్రలోభాలు పెట్టందన్నారు. 

 

మరణానికి మందు ట్వీట్ చేసిన భయ్యూజీ మహారాజ్
ఏఎన్ఐ న్యూస్ ఏజెన్నీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన తుపాకీతో కాల్పుకొని ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. ఆ తర్వాత ఆయన్ను ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.ఆయన మరణానికి ముందు ఆరు వరస ట్వీట్లు చేసినట్లు తెలిసింది.

 

 

మంత్రి పదవి ఆఫర్‌ను మహారాజ్‌కు తిరస్కరించారు..
భయ్యూ మహారాజ్ అసలు పేరు ఉద్దవ్ సింగ్ దేశ్ ముఖ్ . అయితే మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలో భక్తులు ఆయన్ను భయ్యూ మహారాజ్ అంటారు.  సంసార జీవితంలో ఉంటూనే భయ్యు మహారాజ్ స్వామీజీగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిస్వార్థంగా ఉంటూ ఎలాంటి పారితోషికం ఆశించకుండా జనాలకు సేవ చేసే వ్యక్తి అని తెలిసింది. అలాంటి వ్యక్తికి రాష్ట్రానికి మంత్రి హోదా కల్పిస్తామని సీఎం శివరాజ్ సింగ్ ఆఫర్ చేశారు. అయితే భయ్యూ మహారాజ్ దీన్ని ఆయన తిరస్కరించారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close