Delhi TRS Bhavan:దేశ రాజధానిలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు షురూ..!

Delhi TRS Bhavan: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే టీఆర్ఎస్‌ భవన్‌ నిర్మాణ పనులు షురూ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ..పనులను ప్రారంభించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 08:19 PM IST
  • ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్‌ నిర్మాణ పనులు
  • ప్రారంభించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • త్వరలో పూర్తి చేయాలని ఆదేశం
Delhi TRS Bhavan:దేశ రాజధానిలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు షురూ..!

Delhi TRS Bhavan: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే టీఆర్ఎస్‌ భవన్‌ నిర్మాణ పనులు షురూ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ..పనులను ప్రారంభించారు. టీఆర్ఎస్ భవన్‌ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు మంజూరైయ్యాయి.

ఎండీపీ(MDP) ఇన్ఫ్రా నిర్మాణ సంస్థ నిర్మాణ పనులను చేపట్టింది. సీఎం కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. కీలక ఘట్టంలో తనకు భాగస్వామ్యం చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పనులన్నీ పూర్తి అవుతుతాయని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా టీఆర్ఎస్ భవన్ నిర్మాణ ప్లాన్‌ను మంత్రి ప్రశాంత్‌రెడ్డికి నిర్మాణ సంస్థ ప్రతినిధులు అందజేశారు. భవన నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ భవన్‌పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తు చేశారు.

ఇటీవల ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సీఎం కేసీఆర్(CM KCR) ..ప్రత్యేక పూజల అనంతరం భూమి పూజ చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ సైతం ఢిల్లీలో ఉన్నారు. భవన్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

Also read:MLC Anantha Babu Car: సుబ్రహ్మణ్యం మృతి కేసులో ట్విస్ట్..ఆర్థిక లావాదేవీలున్నాయా..?

Also read:Elon Musk Issue:ఎలాన్ మస్క్‌పై ఇన్‌సైడర్ సంచలన కథనం..విషయం ఏంటి..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.'

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News