మనశ్శాంతి లేదని స్వామిజీ ఆత్మహత్య

మనశ్శాంతి లేదని ఒక స్వామిజీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

Updated: Jan 9, 2018, 12:37 PM IST
మనశ్శాంతి లేదని స్వామిజీ ఆత్మహత్య

మనశ్శాంతి లేదని ఒక స్వామిజీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని హుళ్లత్తి గ్రామ దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామిజీ(38) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి  చూసింది. 

వివరాల్లోకి వెళితే..మహాలింగ స్వామిజీ ఇదివరకు గదం జిల్లా శిరహట్టి తాలూకాలోని బాలేహోసూర్ చెందిన  దింగాలేశ్వర మఠంలో ఉండేవారు. కొన్ని నెలల క్రితమే స్వామిజీ దింగాలేశ్వర శాఖకు వచ్చారు. ఆదివారం అర్థరాత్రి ఎవరూ మఠంలో లేకుండటం చూసి ఆ సమయంలో డెత్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్నారు. సోమవారం తెల్లవారుఝామున మఠానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గ్రహించి వెంటనే తాలూకా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి డెత్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో స్వామిజీ తన మరణానికి ఎవరూ కారణం కాదని.. గత కొంతకాలంగా మనశ్శాంతి లేదని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన దేహాన్ని మఠంలోనే ఖననం చేయాలని కోరారు.