ప్రమాదంలో కుమారస్వామి ప్రభుత్వం; కాంగ్రెస్- జేడీఎస్ కూటమిలో కలవరం

కర్నాటక రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశానికి నలుగురు ఎమెల్యేలు గైర్హాజరు కాకపోవడం హస్తం పార్టీలో కలవరం మొదలైంది. ప్రమాదాన్ని గమనించిన కర్నాటక కాంగ్రెస్ ..తమ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్ట్ కు తరలించారు. మరోవైపు అధికార పార్టీని మరింత ఢిఫెన్స్ లోకి నెట్టేందుకు బీజేపీ తన వ్యూహాలను మరింత పదును పెడుతోంది. 

కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో కలవరం...

సీఎల్పీ భేటీకి డమ్మాకొట్టిన నలుగురు ఎమెల్యేలపై చర్యలు తీసుకునేందకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలెట్టింది. రమేశ్ జర్కీ హోలి, మహేష్ కుమ్మంతల్లి, బీనాగేంద్ర, ఉమేష్ శాదవ్ లపై చర్యలు తీసుకుంటామని సీఎల్పీ నేత సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఉమేష్ యాదవ్ స్పందిస్తూ తాను అనారోగ్య కారణంగానే సీఎల్పీ భేటీకి తాను హాజరుకాలేకపోయాని లేఖ ద్వారా తెలిపారు. అయితే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఈ ముగ్గురిపై  చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమౌతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కర్నాటకలో కుమార స్వామి ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉందని జోరుగా చర్చలు సాగుతున్నాయి. నేడో రేపో ప్రభుత్వం కూలిపోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

లెక్కలు ఇలా ఉన్నాయి..

మొత్తం 224 స్థానాలున్న కర్నాటకలో బీజేపీకి 104, కాంగ్రెస్ 79, జేడీఎస్ 37 మంది సభ్యుల బలం ఉంది. గత ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ కూటమిగా ఏర్పడి చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కర్నాటకలో బీఎస్పీ, కేపీజేపీకి ఒక్కో స్థానం ఉండగా..స్వత్రంతంగా గెలుపొందిన ఓ ఎమ్మెల్యే కుమారస్వామికి మద్దుతు ప్రకటించారు. దీంతో మొత్తం 120 సభ్యుల బలంతో కుమారుస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కర్నాటక లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113. కుమార స్వామి 120 మంది సభ్యల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో స్వతంత్ర ఎమెల్యే ఇటీవలె బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు తాగా నలుగురు ఎమ్మెల్యేలు సీఎల్పీ భేటీకి డమ్మాకొట్టడం వంటి పరిణామాలతో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు కలవర పడుతున్నాయి. ఎందుకుంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు గనుక బీజేపీ వైపు జంప్ అయిందే కూమారస్వామి ప్రభుత్వబలం 115కి పడిపోతుంది. దీంతో పాటు పలువురు ఎమెల్యేలు  బీజేపీలో చేరుతారని ప్రచారం వినిపిస్తోంది. తాజా పరిణామాలు ప్రభుత్వ మనుగడకు ఇబ్బందిగా పరిగణిస్తున్నాయి

సిద్ధరామయ్య,కుమార స్వామి రియాక్షన్

ప్రభుత్వ మనుగుడకు ప్రమాదం ఉందన్న వార్తలను కాంగ్రెస్ సీఎస్పీ నేత సిద్ధరామయ్య ఖండించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలవలేనే భయంతో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ఎన్నికుట్రలు చేసినా ప్రభుత్వాన్నికూలడం జరగదని ధీమా వ్యక్తం చేశారు. అటు కోల్ కతా ర్యాలీనికి వెళ్లిన కుమారస్వామి దీనిపై స్పందిస్తూ తమ ఎమెల్యేలను కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. దీంతో కర్నాటక లో రాజకీయ వాతావరణ మరింత వేడెక్కింది

English Title: 
Does the Kumaraswamy government continue in Karnataka?
News Source: 
Home Title: 

ప్రమాదంలో కుమారస్వామి ప్రభుత్వం

ప్రమాదంలో కుమారస్వామి ప్రభుత్వం; కాంగ్రెస్- జేడీఎస్ కూటమిలో కలవరం
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ప్రమాదంలో కుమారస్వామి ప్రభుత్వం;కాంగ్రెస్- జేడీఎస్ కూటమిలో కలవరం
Publish Later: 
No
Publish At: 
Saturday, January 19, 2019 - 14:09