భారత నాయకులకు ఫేస్‌బుక్ ర్యాంకింగ్స్

భారతదేశంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలుగా ఉన్న నాయకులకు ఫేస్‌బుక్ ర్యాంకింగ్స్ ప్రకటించింది.

Updated: Jan 3, 2018, 08:13 PM IST
భారత నాయకులకు ఫేస్‌బుక్ ర్యాంకింగ్స్

భారతదేశంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలుగా ఉన్న నాయకులకు ఫేస్‌బుక్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఆయా ఎంపీల ఫేస్‌బుక్ పేజీలకు వచ్చిన అత్యధిక లైకులు, షేర్లు, కామెంట్లు ఆధారంగా 2017 సంవత్సరానికి గాను ఈ ర్యాంకులు ప్రకటించింది. అందులో ఫేస్‌బుక్‌లో జనాలు ఎక్కువగా కామెంట్లు పెట్టే లోక్‌సభ నాయకుల్లో తొలిస్థానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పొందగా.. రాజ్యసభకి గాను అదే ర్యాంకును సచిన్ టెండుల్కర్ కైవసం చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్కే సిన్హా, అమిత్ షా, అసదుద్దీన్ ఒవైసీ, భగవత్ మన్ ఉన్నారు. 

ఇక శాఖల పేజీల విషయానికి వస్తే ప్రధాని మంత్రి కార్యాలయం పేజీ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో రాష్ట్రపతి కార్యాలయం పేజీ ఉంది. ఇక మంత్రిత్వ శాఖల పేజీల విషయానికి వస్తే.. విదేశాంగ మంత్రిత్వ శాఖ తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ముఖ్యమంత్రుల జాబితా విషయానికి వస్తే తొలిస్థానాన్ని యూపీ సీఎం ఆదిత్యనాథ్ పొందగా, రెండవ స్థానాన్ని రాజస్థాన్ సీఎం వసుంధర రాజే పొందారు. అలాగే రాజకీయ పార్టీల ఫేస్ బుక్ పేజీలకు కూడా ర్యాంకింగ్స్ ప్రకటించగా తొలి స్థానాన్ని బీజేపీ, రెండవ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ, మూడవ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి.