కర్నాటక రైతులకు గుడ్ న్యూస్; రుణాలు మాఫీ చేసిన సర్కార్

Last Updated : Jul 5, 2018, 04:05 PM IST
కర్నాటక రైతులకు గుడ్ న్యూస్; రుణాలు మాఫీ చేసిన సర్కార్

కర్నాటకలో రైతులకు శుభవార్త. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేశారు. అసెంబ్లీ సాక్షిగా  సీఎం కుమారస్వామి గురవారం ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ , జేడీయూ పార్టీలు రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ క్రమంలో సీఎం కుమారస్వామి ఈ రోజు  రుణాలను మాఫీ చేసి రైతులకు ఊరట కల్గించారు.  అయితే రుణమాఫీకి ఎలాంటి పద్దతి అవలంభిస్తారనే విషయం కుమారస్వామి వివరించలేదు. ఏపీ, తెలంగాణ తరహా దశల వారీగా చేస్తారా.. లేదంటే ఒకే దశలో చేస్తారా అనేది గమనార్హం. 

కాగా తాజా ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కర్నాటకలో రైతు రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాఫీ ఎందుకు చేయలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఇదిలా ఉండగా తాజా ప్రకటనపై కర్నాటక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Trending News