రజినీ వెబ్సైటు ప్రారంభం.. మీడియాకు క్షమాపణలు

తమిళ సినీనటుడు సూపర్ స్టార్ రజినీ కాంత్  ఇటీవలే రాజకీయ తెరంగేట్రం చేశారు.

Updated: Jan 3, 2018, 07:14 PM IST
రజినీ వెబ్సైటు ప్రారంభం.. మీడియాకు క్షమాపణలు

తమిళ సినీనటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే రాజకీయ తెరంగేట్రం చేశారు. కొత్త సంవత్సరంలో పొలిటికల్ వెబ్సైట్‌ను, యాప్ ను కూడా ప్రారంభించి తనదైన శైలిలో రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు తలైవా. అయితే తాజాగా ఆయన మీడియాకు క్షమాపణ చెప్పారు. చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో జరిగిన ఒక కార్యాక్రమానికి హాజరైన ఆయన మీడియాకు 'సారీ' చెప్పారు.

రజినీకాంత్ మాట్లాడుతూ- రాజకీయ ప్రవేశం గురించి ప్రపంచానికి తెలిసేలా కథనాలు రాసిన మీడియాకు ధన్యవాదాలు. "నా తొలి ఉద్యోగం మీడియాలో ప్రూఫ్ రీడర్. దాదాపు రెండు నెలలపాటు ఆ ఉద్యోగం చేశాను. ఇప్పటివరకు తాను ఏవైనా తప్పులు చేసి ఉంటే, తప్పుగా మాట్లాడి ఉంటే  క్షమించండి" అని ఆయన మీడియాను కోరారు.

రజినీకాంత్ గతేడాది చివరిరోజైన డిసెంబరు 31 తేదీన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేయడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన 24 గంటల్లోనే వెబ్సైట్, యాప్‌ను ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు.