గూగుల్‌కి రూ.160 కోట్ల జరిమానా విధించిన భారత్

గూగుల్ కంపెనీకి భారత ప్రభుత్వం భారీ షాక్

Last Updated : Feb 9, 2018, 12:55 AM IST
గూగుల్‌కి రూ.160 కోట్ల జరిమానా విధించిన భారత్

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కంపెనీకి భారత ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వ్యాపారంలో మోసపూరితమైన మార్గాన్ని అనుసరించి ఇతర పోటీదారులు, వినియోగదారులకి నష్టం కలిగించినందుకుగాను గూగుల్‌కి రూ.136 కోట్ల జరిమానా విధిస్తూ కాంపిటీషిన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీచేసింది. ఈ మొత్తం జరిమానా చెల్లించేందుకు గూగుల్‌కి 60 రోజుల గడువు ఇస్తున్నట్టు సీసీఐ స్పష్టంచేసింది.

వివిధ రంగాల్లోని వ్యాపారాల్లో వాణిజ్య సంస్థలు అనుసరించే వ్యాపార పద్ధతులు, సంస్థల నాణ్యతా ప్రమాణాలని పర్యవేక్షించే కాంపిటీషిన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. గూగుల్ సంస్థకు చెందిన ఆల్ఫాబెల్ కంపెనీ వెబ్ సెర్చ్‌తోపాటు, అడ్వర్టెయిజ్‌మెంట్స్‌లో పై చేయి సాధించేందుకు అక్రమ మార్గాలని అనుసరించినట్టు గుర్తించింది. గూగుల్ కారణంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్స్ వ్యాపారాల్లో పోటీ సంస్థలు, యూజర్లు నష్టపోయారని నిర్ధారిస్తూ కాంపిటీషిన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ జరిమానా విధించింది. 

సీసీఐ ఇచ్చిన ఈ ఆదేశాలపై గూగుల్ ఏమని స్పందిస్తుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో తిష్ట వేసుకుకూర్చున్న ఈ టెక్నాలజీ దిగ్గజానికి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైన సందర్భాలు చాలా అరుదు అని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Trending News