'తాజ్ మహల్' సందర్శన పై ఆంక్షలు?

సంబంధిత మంత్రిత్వశాఖ ఆన్లైన్, ఆఫ్ లైన్‌లో రెండింటిలో కలిపి మొత్తం 40,000 మించి టికెట్లు విక్రయించవద్దని అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది.

Updated: Jan 3, 2018, 07:17 PM IST
'తాజ్ మహల్' సందర్శన పై ఆంక్షలు?

ఇప్పటివరకు 'తాజ్ మహల్' సందర్శనపై ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ, తాజాగా ప్రభుత్వం 'తాజ్ మహల్' సందర్శనపై ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. పిటీఐ కధనం మేరకు, భారత పురావస్తు శాఖ తాజ్‌మహల్‌ను సందర్శించడానికి రోజూ కేవలం 40,000 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతిస్తుంది. అలానే ప్రతి టికెట్ పై మూడు గంటల కాలపరిమితిని విధించింది.

సంబంధిత మంత్రిత్వశాఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్2లో రెండింటిలో కలిపి మొత్తం 40,000 మించి టికెట్లు విక్రయించవద్దని చెప్పిందట. ఇప్పటివరకు ఈ 16వ శతాబ్దానికి చెందిన కట్టడాన్ని చూడటానికి ఎటువంటి ఆంక్షలు లేవు. ఏటా దీన్ని చూడటానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏటా తాజ్‌ను సందర్శించే వారి సంఖ్య 10 నుండి 15శాతం పెరుగుతూనే  ఉంది. రద్దీ సమయాలలో రోజుకు 60-70 వేలమంది పర్యాటకులు సందర్శిస్తారు. అయితే పర్యాటకుల కుదింపు అంశంపై నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్(ఏంఇఇఆర్ఐ) ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారని ఏఎన్ఐ పేర్కొనింది.