కుమారస్వామిపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి.. వారు బలపరీక్ష మిస్సవుతారా..?

సుప్రీంకోర్టు శనివారం కాంగ్రెస్, జనతాదళ్ ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీ్కరును మార్చమని చేసిన అభ్యర్థనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. 

Last Updated : May 20, 2018, 03:57 PM IST
కుమారస్వామిపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి.. వారు బలపరీక్ష మిస్సవుతారా..?

సుప్రీంకోర్టు శనివారం కాంగ్రెస్, జనతాదళ్ ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకరును మార్చమని చేసిన అభ్యర్థనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బల పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో యడ్యూరప్ప వర్గంతో పాటు కుమారస్వామి వర్గం కూడా ఎమ్మెల్యేల మద్దతు కోసం ఎవరి చాణక్య ఎత్తులు వారు వేస్తున్నారు.

అయితే ఇదే క్రమంలో కుమారస్వామిపై కొందరు జేడీఎస్ ఎమ్మెల్యేలు కినుక వహిస్తున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్‌, ప్రతాప్‌గౌడ పాటిల్‌ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో వారు కూడా బీజేపీ పంచన చేరే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. వారిని గాలి సోదరుడు సోమశేఖరరెడ్డి ప్రలోభపెడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

మరో పక్క బీజేపీ నేతలు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నట్లు ఆడియో టేపులు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా గాలి జనార్థనరెడ్డి, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఫోనులో మాట్లాడిన రికార్డింగ్ ఎన్నో అనుమానాలకు తావిస్తుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌తో యడ్యూరప్ప మాట్లాడిన టేపు కూడా విడుదలైంది. అందులో పాటిల్‌కు యడ్యూరప్ప మంత్రి పదవిని ఇస్తానని చెప్పినట్లు బహిర్గతమైంది. 

Trending News