Thalapathy Vijay: నా ఫ్యాన్స్ అంతా ఎలక్షన్స్‌లలో పోటీకి దిగండి.. హీరో విజయ్ బంపర్​ ఆఫర్‌‌!

Vijay’s fans contest in elections: హీరో విజయ్‌ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో రోజులుగా సాగుతోన్న చర్చకు ఇక పుల్‌స్టాప్‌ పడినట్లే. "విజయ్‌ మక్కల్‌ ఇయక్కం" పార్టీ తరఫున ఫ్యాన్స్‌ను ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేశాడట విజయ్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 07:42 AM IST
  • హీరో విజయ్‌ రాజకీయ తెరంగేట్రంపై కొంత కాలంగా చర్చ
  • గతంలో రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడని విజయ్‌..
  • తాజ ప్రకటనతో విజయ్‌కి పాలిటిక్స్‌లోకి రావాలనే కోరిక ఉందని స్పష్టం
Thalapathy Vijay: నా ఫ్యాన్స్ అంతా ఎలక్షన్స్‌లలో పోటీకి దిగండి.. హీరో విజయ్ బంపర్​ ఆఫర్‌‌!

Vijay’s fans to contest : హీరో విజయ్‌ రాజకీయ తెరంగేట్రంపై గత కొంత కాలంగా చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. విజయ్ తండ్రి, డైరెక్టర్ ఎస్‌ఎం చంద్రశేఖర్‌ "విజయ్‌ మక్కల్‌ ఇయక్కం" (Vijay Makkal Iyakkam) అనే పార్టీ పేరును చాలా రోజుల క్రితమే రిజిష్టర్‌ చేయించారు. అయితే ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్థలు వచ్చాయి.

గతంలో రాజకీయాల్లోకి (Politics) రావడానికి విజయ్‌ ఇష్టపడలేదు. అయితే ఇప్పుడేమో విజయ్‌కి పాలిటిక్స్‌లోకి రావాలనే కోరిక ఉందని తెలుస్తోంది. అందుకే తన రాజకీయ రంగ ప్రవేశానికి ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటున్నారనే తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో చర్చ సాగుతోంది.

ఇక కొన్ని రోజుల క్రితం తమిళనాడులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్‌ ఫ్యాన్స్‌ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 వార్డుల్లో పోటీ చేశారు. అందులో 129 వార్డుల్లో విజయ్‌ ఫ్యాన్స్ విజయం సాధించారు. ఆ ఎలక్షన్స్‌లో (Elections‌) విజయ్‌ తన పేరును, ఫోటోలను వాడొద్దంటూ ఆంక్షలు విధించాడు. 

ఇక విజయ్ ఫ్యాన్స్ మాత్రం గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి విజయాన్ని చేజిక్కించుకున్నారు. తర్వాత వారంతా విజయ్‌ను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేసి సంబరాలు చేసుకున్నారు. ఇదంతా అప్పట్లో రాజకీయ వర్గాల్ని పెద్ద షాక్‌కే గురి చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నెల 19న జరగనున్న నగరపాలక ఎన్నికల్లో "విజయ్‌ మక్కల్‌ ఇయక్కం" పేరుతో పోటీ చేయడానికి విజయ్‌ తన ఫ్యాన్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. దీని గురించి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్‌ తాజాగా అధికార ప్రకటన కూడా చేశారు.

Also Read: Todays Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

తమిళనాడులో రానున్న నగర పాలక ఎలక్షన్స్‌లలో "విజయ్‌ మక్కల్‌ ఇయక్కం" పేరుపై పోటీ చేయవచ్చని బుస్సీ ఆనంద్‌ పేర్కొన్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్‌లో (Vijay Fans‌) ఆనందం నెలకొంది. తమ హీరో నుంచి గ్రీన్‌ సిగ్నల్ రావడంతో నగర పాలక ఎలక్షన్స్‌లలో (Elections‌) "విజయ్‌ మక్కల్‌ ఇయక్కం" పార్టీ తరఫున పోటీ చేసి విజయ దుందుభి మోగించాలనుకుంటున్నారు.

Also Read: Trai Guidelines: ఇక నుంచి మొబైల్ ఫోన్స్ రీఛార్జ్ ప్లాన్స్‌లో 30 రోజుల కాలవ్యవధి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News