దావూద్ ఇబ్రహీం ఆస్తుల్లో హోటల్స్, ఖరీదైన భవనాలు

దావూద్ ఇబ్రహీంకి బ్రిటన్‌లో భారీ మొత్తంలో ఆస్తులు

Updated: Feb 5, 2018, 05:05 PM IST
దావూద్ ఇబ్రహీం ఆస్తుల్లో హోటల్స్, ఖరీదైన భవనాలు

గత కొన్ని దశాబ్ధాలుగా భారత్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ మాఫియా డాన్, టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంకి బ్రిటన్‌లో భారీ మొత్తంలో ఆస్తులు వున్నాయని తాజాగా బ్రిటన్‌కే చెందిన ప్రముఖ దినపత్రిక 'ది టైమ్స్' వెల్లడించింది. యూకేలో అనేక చోట్ల పెద్ద పెద్ద లగ్జరీ హోటల్స్, ఖరీదైన భవనాలు, వాణిజ్య సముదాయాలు, విలాసవంతమైన నివాసాలు వున్నట్టు ది టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. లండన్‌తోపాటు యూకే వ్యాప్తంగా దావూద్ పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్టు సదరు దినపత్రిక కథనం పేర్కొంది. యూకేలోని స్పెయిన్, మొరాకో, లండన్‌తోపాటు యూకే బయట వున్న ఆస్ట్రేలియాలోనూ దావూద్ తన వ్యాపార సామాజ్ర్యాన్ని విస్తరించుకున్నట్టు ఆ కథనం స్పష్టంచేసింది. 

 

యుకే వ్యాప్తంగా ప్రభుత్వానికి లెక్క చెప్పని ఆస్తులని వెలికితీస్తున్న క్రమంలో దావూద్ ఆస్తులు వెలుగుచూసినట్టు సమాచారం.