పట్టాల మీదకు వస్తున్న భారతదేశంలోనే తొలి ఇంజిన్ లెస్ రైలు.. ఈ రోజే ట్రైల్ రన్

భారతదేశంలో తొలి ఇంజిన్ లెస్ రైలుకి సంబంధించిన ట్రైల్ రన్ నేడే ప్రారంభం కానుంది. 

Last Updated : Nov 17, 2018, 12:29 PM IST
పట్టాల మీదకు వస్తున్న భారతదేశంలోనే తొలి ఇంజిన్ లెస్ రైలు.. ఈ రోజే ట్రైల్ రన్

భారతదేశంలో తొలి ఇంజిన్ లెస్ రైలుకి సంబంధించిన ట్రైల్ రన్ నేడే ప్రారంభం కానుంది. బరేలీ- మోరాదాబద్ సెక్షన్ల నడుమ ఈ ట్రైన్‌కు సంబంధించిన ట్రైల్ రన్ నడపడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు  తయారుచేసిన ఈ ట్రైన్‌కు "ట్రైన్ 18" అని నామకరణం చేశారు. 30 సంవత్సరాల శతాబ్ది ఎక్స్ ప్రెస్ స్థానంలో ఈ రైలు సేవలందించనుందని రైల్వే బోర్డు ఛైర్మన్ అశ్వనీ లోహనీ తెలిపారు. 16 కోచ్‌‌లు కలిగిన ఈ ఎయిర్ కండీషన్డ్ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని అంటున్నారు. దాదాపు 18 నెలల కాలంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ట్రైన్ నిర్మాణం చేసినట్లు చెబుతున్నారు.

ప్రత్యేకమైన లోకోమోటివ్ ఇంజిన్ లేకుండా ఎక్కువ దూరం పయనించే  ట్రైన్ ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రైన్‌కు సంబంధించిన ట్రయిల్ రన్ నిర్వహించడానికి రిసెర్చి డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ సంస్థ తమ టీమ్‌‌ను పంపించడం జరిగింది. అయితే టెస్ట్ రెన్ నిర్వహించాక... కమీషన్ ఆఫ్ రైల్వే  సేఫ్టీ ఈ రైలును నడపాలా వద్దా? అన్న విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి.. సర్టిఫికేషన్ ఇస్తుంది. 

80 శాతం భారతీయ సాంకేతిక నైపుణ్యంతో ఈ రైలును తయారుచేశారని అధికారులు అంటున్నారు. ఈ రైలుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో 56 మంది, నాన్ ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో 78 మంది జనాలు కూర్చునేందుకు అన్ని సదుపాయాలూ ఉన్నాయి. GPS ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థతో పాటు బయో వాక్యూమ్ టాయిలెట్స్, వైఫై, ఎల్‌ఈడీ లైటింగ్ మొదలైన ప్రత్యేకతలు కూడా రైలు సొంతం చేసుకుంది.  కేవలం లోకో పైలెట్ క్యాబిన్ మాత్రమే కలిగుండే ఈ రైలు ఢిల్లీ-భోపాల్ మధ్య గంటకు 150 నుంచీ 155 కిలోమీటర్ల వేగంతో నడపడం కోసం తయారుచేయడం జరిగింది.

Trending News