బడ్జెట్ 2018 పై సర్వత్రా నెలకొన్న ఆసక్తి

ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ అధికారులందికీ ఆ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హల్వా తినిపించి మరీ బడ్జెట్ పత్రాల ముద్రణను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Last Updated : Jan 25, 2018, 06:05 PM IST
 బడ్జెట్ 2018 పై సర్వత్రా నెలకొన్న ఆసక్తి

ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ అధికారులందికీ ఆ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హల్వా తినిపించి మరీ బడ్జెట్ పత్రాల ముద్రణను ప్రారంభించిన సంగతి తెలిసిందే.  కాగా బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడతారని సమాచారం. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు  ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశబెట్టబోతున్న ఆఖరి బడ్జెట్ కూడా ఇదే అని తెలుస్తోంది. ఇప్పటికి 2018-19 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను స్లాబ్‌లు రేట్లు తగ్గే అవకాశం ఉందని.. అలాగే  డివిడెండ్లపై ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను రేట్లు కొనసాగే అవకాశాలు  ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మోదీ కూడా ఇటీవలే 2018 బడ్జెట్ జనాకర్షంగా ఉండబోదని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

ఈ క్రమంలో బడ్జెట్ 2018 ఎలా ఉండబోతుందన్న విషయంపై పలు అభిప్రాయాలు ఇవి

*బ్యాంకింగ్‌పై ఉన్న 18శాతం జీఎస్‌టీని తగ్గించే అవకాశం ఉంది

*మైక్రో ఏటీఎంలపై  ఉన్న జీఎస్‌టీని 18శాతం నుంచి 5శాతానికి తగ్గించే అవకాశం ఉంది

*‘ప్రధాన మంత్రి ఫసలీ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం క్రింద గత సంవత్సరం రూ.10,700 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ కేటాయింపులను రూ.13వేల కోట్లకు పెంచే అవకాశం ఉంది

*2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు దాదాపు రూ.9.8 లక్షల కోట్లు వస్తాయని ఇప్పటికే అంచనా వేస్తున్నారు

*అలాగే ఈ బడ్జెట్‌లో బిట్‌కాయిన్ల వాడకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది

*కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి ప్రభుత్వం తగ్గిస్తుందా లేదా అన్న విషయం కూడా ఈ బడ్జెట్‌లో వేచి చూడాల్సిందే

*రైల్వే బడ్జెట్ విషయానికి వస్తే అన్ని పాత ప్రతిపాదనలే తప్పితే కొత్తవేవీ రాకపోవచ్చని వినికిడి

*2018-19 బడ్జెట్‌లో ప్రస్తుత రూ.2.5 లక్షల వార్షిక పన్ను మినహాయింపును రూ.5 లక్షల చేసే అవకాశం ఉందో లేదో తెలియదు గానీ.. కనీసం రూ.3 లక్షలకైనా పెంచాలన్న ప్రతిపాదనలు మాత్రం వస్తున్నాయి

*మోదీ సర్కర్ తమ సంస్కరణలలో భాగంగా... బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని కూడా ఫిబ్రవరి 1కి మార్చడం విశేషం.

Trending News