ఐపీఎల్ 2018 సాంగ్ రిలీజ్ ; చూసి ఎంజాయ్ చేయండి

Updated: Mar 14, 2018, 12:15 PM IST
ఐపీఎల్ 2018 సాంగ్ రిలీజ్  ; చూసి ఎంజాయ్ చేయండి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2018 మరి కొన్ని రోజుల్లో మన ముందుకు వచ్చి కనివిందు చేసేందుకు రెడీ అయింది. ఏప్రిల్ 7న ఈ టోర్నీ ప్రారంభమౌతున్న నేపథ్యంలో దీని పబ్లిసిటీ కోసం రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2018 సాంగ్ విడుదల చేశారు. బీసీసీఐతో కలిసి బ్రాడ్‌కాస్టర్ ‘స్టార్ ఇండియా’ ఓ ప్రమోషనల్ సాంగ్‌ని విడుదల చేసింది. 

ఇంగ్లీష్, హిందీ భాషలకే పరిమితం కాకుండా అమ్మభాష తెలుగుతో పాటు  తమిళం, కన్నడ , బెంగాలి భాషల్లోనూ ఐపీఎల్ సాంగ్ విడుదల చేయడం విశేషం. ఇంకెందుకు ఆలస్యం ఈ సాంగ్ చూసి ఎంచక్క చేయండి మరి...

 

ఏప్రిల్ 7న ప్రారంభంకానున్న ఐపీఎల్ 2018 తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. కాగా 2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ ఇప్పటికే పదేళ్లు పూర్తి చేసుకోవడం విశేషం.