సోషల్ మీడియాలో సీఎం సిద్ధరామయ్య పరువు గోవిందా !

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

Updated: Jan 11, 2018, 10:16 AM IST
సోషల్ మీడియాలో సీఎం సిద్ధరామయ్య పరువు గోవిందా !

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. అయితే, అదేమీ చెప్పుకునేంత గొప్ప ఘనకార్యంతో కాదు లెండి!! అవును, మంగళవారం మడికెరిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి హాజరైన సీఎం సిద్ధరామయ్య అక్కడే స్టేజీపై కునుకు తీస్తూ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ అయ్యింది. పార్టీ కార్యక్రమంలోనే చుట్టూ వున్న వాళ్లంతా చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం సైతం లేకుండా ఈ లోకంతో నాకేం పని అన్న చందంగా కునుకు తీస్తూ కనిపించిన వైనం ఆయన్ని దాదాపు సోషల్ మీడియాకు ఇడ్చినంత పనిచేసింది. సీఎం గారి స్లీపింగ్ ఎపిసోడ్‌పై ట్విటర్‌లో భారీ సంఖ్యలో జోకులు వైరల్ అవుతున్నాయి. 

 

సిద్ధరామయ్య తీరుపై ట్విటర్ లో అనేకమంది జోకులు వేసుకుంటూ కనిపించడం చూస్తే, వారికి ఆయన ఎంత లోకువయ్యాడో ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే సిద్ధరామయ్య ఇలా పార్టీ వేదికలపై నిద్రపోతూ కనిపించడం ఇదేం తొలిసారి కాదండోయ్!! గతేడాది మే 26న బెంగుళూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో వేదికపై ముందు వరుసలో కూర్చుని పక్కన వున్న వాళ్లతో తనకు ఏ సంబంధం లేదన్నట్టుగా కునికిపాట్లు పడి అబాసుపాలైన సంగతి తెలిసిందే.