కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న చిరంజీవి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రజలను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

Last Updated : Apr 22, 2018, 08:47 PM IST
కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న చిరంజీవి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రజలను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో చిరంజీవి ప్రచారం కలిసివస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ డి.శివకుమార్ శనివారంనాడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేశారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సహచర విపక్ష పార్టీలకు చెందిన వాళ్లను కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు కల్పించారు. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ పేర్లు కూడా ఉన్నాయి. అలాగే 22 మంది సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేతల పేర్లు కూడా ఖరారయ్యాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, శశిథరూర్, సచిన్ పైలట్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, అశోక్ చవాన్, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, అశోక్ గెహ్లాట్, కుష్బూ, నగ్మా, సుచిత్రా దేవ్, రేణుకా చౌదరి, రణ్‌దీప్ సూర్జేవాలా, ఊమన్ చాందీ, అమిత్ దేశ్‌ముఖ్, అమ్రిందర్ సింగ్, ధీరజ్ దేశ్‌ముఖ్, రాజ్‌బబ్బర్, రమేష్ చెన్నితాల తదితరులున్నారు. 225 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీకి మే 12న పోలింగ్ జరుగుతుండగా, మే 15న ఫలితాలు వెలువడతాయి.

Trending News