కాషాయం కోటు ధరించిన గవర్నర్..

కాషాయం కోటు ధరించిన గవర్నర్..

Updated: May 17, 2018, 10:08 AM IST
కాషాయం కోటు ధరించిన గవర్నర్..

బెంగళూరు: కర్ణాటక గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా కాషాయం కోర్టు ధరించడం పలువురిని విస్మయానికి గురించేసింది. గవర్నర్ కాషాయం రంగు కోటు ధరించి, తాను ఎప్పటికే బీజేపీ మనిషినేనని పరోక్షంగా చెప్పుకున్నారని కొందరు ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. బీజేపీ నేత యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడానికి వచ్చిన గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా కాషాయం రంగు కోటు ధరించడం బీజేపీ పట్ల ఆయనకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని పలువురు వ్యాఖ్యానించారు.

 

వాజుభాయ్ వాలా పూర్వపు బీజేపీ నేత, 2002లో నరేంద్ర మోదీ కోసం సీటు కూడా త్యాగం చేశారు. ఆతరువాత సీఎం మోదీ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

వాజూభాయ్ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో ప్రారంభించారు. తరువాత 1971లో జన సంఘ్‌లో చేరారు. 1975లో అత్యవసర పరిస్థితుల్లో ఆయన పదకొండు నెలల జైలుశిక్ష గడిపారు. 1980లో రాజ్కోట్ మేయర్‌గా ఎన్నికయ్యారు. తరువాత ఆయన రాజ్కోట్ నుండి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి 1998 నుంచి 2012 వరకు క్యాబినెట్ మంత్రిగా ఆర్ధిక, రెవెన్యూ శాఖలకు పనిచేశారు. రెండుసార్లు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. డిసెంబరు 2012లో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై ఆగస్టు 2014 వరకు పనిచేశారు. కర్ణాటక గవర్నర్ సెప్టెంబర్ 2014 లో నియమించబడ్డారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close